IPL 2020: ఆ లెక్కన కింగ్స్ పంజాబ్‌దేనా టైటిల్.. అప్పటి చెన్నైలా చెలరేగుతుందా?

హైదరాబాద్: ఐపీఎల్ పదమూడో సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరడమే కష్టమే అనుకున్న దశలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పంజా విసురుతోంది. సీజన్ ఫస్టాఫ్‌లో ఏడు మ్యాచ్‌లాడి ఆరింట ఓడిన రాహుల్ సేన.. తర్వాత మూడు మ్యాచ్‌ల్ని వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఈ మూడు విజయాలు కూడా పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లపై రావడం విశేషం. ఈ దూకుడుతో అట్టడుగున ఉన్న కింగ్స్ మొత్తం నాలుగు విజయాలతో ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్ రేసులో ఉన్నామని ప్రత్యర్ధులకు హెచ్చరికలు జారి చేసింది.
2010 రిపీట్ అవుతుందా?
అయితే పంజాబ్ దూకుడు చూస్తుంటే తమకు ఐపీఎల్ 2010 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గుర్తుకు వస్తుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆ సీజన్ ఫస్టాఫ్‌లో తేలిపోయిన చెన్నై సెకండాఫ్‌లో అద్భుత ఆటతీరుతో ప్లే ఆఫ్ చేరడంతో పాటు ఫస్ట్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు కూడా పంజాబ్ అలానే రాణించి ఫస్ట్ టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. నిజానికి రాజస్థాన్ చేతిలో చెన్నై ఓడకు ముందు వరకు ఈ సెంటిమెంట్ ధోనీకి వర్తిస్తుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు భావించారు. కానీ ఆ జట్టు ఆ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడటంతో ఇప్పుడు ఆ లక్ పంజాబ్ కలిసొస్తుందంటున్నారు.

చెన్నైలానే ఓటమితో..
ఇక ఆ సీజన్‌లో చెన్నై ఓటమితో ప్రారంభించగా.. తాజా సీజన్‌లో పంజాబ్ కూడా పరాజయంతోనే ప్రారంభించింది. ఆ సీజన్‌లో ఫస్టాఫ్ ముగిసేసరికి చెన్నై ఏడో స్థానంలో ఉంటే పంజాబ్ తాజా సీజన్‌లో ఏనిమిదో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్లిన చెన్నై ఓవరాల్‌గా ఏడు మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో మూడు స్థానంలో నిలిచింది. ఇక పంజాబ్ ఇప్పటికే 10 మ్యాచ్‌ల్లో 4 గెలిచి ఐదో స్థానంలో ఉంది. మిగతా 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచినా 14 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంటుంది.

చెన్నై 7/2, పంజాబ్ 7/1..
2010లో పంజాబ్ ఏడింటిలో రెండు గెలవగా.. పంజాబ్ 2020 సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచింది. ఆ తర్వాత దూకుడు కనబర్చి చెన్నై టైటిల్ గెలవగా.. ఇప్పుడు పంజాబ్ అదే బాటలో నడుస్తుంది. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో హైదరాబాద్, కోల్‌కతా, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. వీటిలో చెన్నై మినహా మూడు జట్లు ప్లే ఆఫ్ రేసుకోసం పోటీపడుతున్నాయి. ఈ మూడింటిని ఓడించినా పంజాబ్‌కు ప్లే ఆఫ్ చేరే అవకాశాలుంటాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
KXIP vs DC trolls: పంత్ కూరగాయలు అమ్ముతున్నావా? ఆ బ్యూటీ కోసమైనా పంజాబ్ గెలవాల్సిందే!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications