Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ వారుసుడు అతనే: బ్రియాన్ లారా

IPL 2020: Brian Lara picks Dhoni’s successor among KL Rahul, Rishabh Pant and Sanju Samson

దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియన్‌ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ యువ వికెట్ కీపర్ ఆట ఎంతో మార్పు వచ్చిందని లారా అభిప్రాయపడ్డాడు. గతంలో లెగ్‌సైడ్‌ వైపే ఎక్కువగా ఆడే పంత్.. ఇప్పుడు ఆఫ్‌ సైడ్‌ కూడా చూడ ముచ్చటైన షాట్లతో అలరిస్తున్నాడని తెలిపాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంతేనన్నాడు. స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్ కనెక్టెడ్ష లో పంత్‌ ఆటతీరును ఈ విండీస్ దిగ్గజం విశ్లేషించాడు.

'ఢిల్లీ జట్టుకు పంత్‌ కీలక ఆటగాడు. అయితే అతని ఆటలో ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. గతంలో క్రీజులోకి వచ్చిన తర్వాత లెగ్‌సైడ్‌ ఎక్కువగా పరుగులు సాధించేవాడు. అతడి పరుగుల్లో అధిక శాతం అక్కడి నుంచి వచ్చేవి. ఆన్‌సైడ్‌ వైపు ఆడటంటపై తనకు ఉన్న మక్కువకు అదే నిదర్శనం. అలానే ఆఫ్ సైడ్ ఆడే షాట్లను ఆన్‌సైడ్ ఆడుతూ వికెట్ ఇచ్చుకునేవాడు. కానీ ప్రస్తుతం అతని ఆలోచన మారింది.

ఆఫ్‌సైడ్‌ వైపు ఆడటంలో మెరుగవుతున్నాడు. మైదానంలో నలుమూలలా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అతడు సాధిస్తున్న పరుగులు కూడా ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆటలో ఎంతో సమతూకం కనిపిస్తోంది. గతంలో అలవాటు లేని ఓవర్‌ ఎక్స్‌ట్రా కవర్‌, ఓవర్‌ పాంయిట్‌, పాయింట్‌ మీదుగా పరుగులు చేస్తున్నాడు. అతడి ఆటలో ఇది గొప్ప పురోగతి. అయితే ఇది ప్రతర్థులకు ఆందోళన కలిగించే అంశం'అని లారా చెప్పుకొచ్చాడు. టీమిండియా వికెట్ కీపింగ్ రేసులో కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ ఉన్నప్పటికీ పంతే సరైనవాడని లారా అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ మంచి బ్యాట్స్‌మెన్ అని, అతను దానిపైనే ఫోకస్ పెట్టాలన్నాడు. ఇక శాంసన్ రాణిస్తున్నా ప్రస్తుతానికి వికెట్ కీపింగ్ చేయడం లేదన్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్‌లో పంత్ రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 42.57 సగటుతో 171 పరుగులు చేశాడు. దాదాపు 140 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడు. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ఢిల్లీ జట్టు విజయాలతో దూసుకెళ్తోంది. 5 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Story first published: Friday, October 9, 2020, 18:27 [IST]
Other articles published on Oct 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+