IPL 2020 టైటిల్ పట్టేందుకు బెంగళూరు కొత్త వ్యూహం.. యూఏఈ సారథితో ఒప్పందం!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా.. ఆ జట్టు ఛాంపియన్‌గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. గత మూడు సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన ఏమాత్రం బాలేదు. ఇక 2019లో అయితే చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020లో ఎలాగైనా కప్ కొట్టాలని వేలం నుంచే ఆచితూచి అడుగులేస్తోంది.

యూఏఈ సారథితో ఒప్పందం
ఐపీఎల్ టైటిల్ విజేతగా ఆవిర్భవించేందుకు తాజాగా బెంగళూరు మరో కొత్త వ్యూహం రచించిందని తెలుస్తోంది. యూఏఈ కెప్టెన్ అహ్మద్ రజా, యువ ఆటగాడు కార్తీక్ మెయప్పన్‌తో బెంగళూరు ఒప్పందం కుదుర్చుకొందట. తమ ఆటగాళ్లతో పాటు ఈ ఇద్దరికీ కూడా శిక్షణనిస్తోందని సమాచారం. ఈ విషయాన్ని అక్కడి జాతీయ పత్రిక ఒకటి ధ్రువీకరించింది. భారత్ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో ఈసారి యుఎఇలో ఐపీఎల్ 2020ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

స్పిన్ సలహాదారుగా
అహ్మద్ రజా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. అందులోనూ స్థానికుడు. యూఏఈ పిచ్‌లపై దేశవాళీ, ఆసియా, అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం అతడికుంది. దాన్ని బెంగళూరు ఉపయోగించుకోవాలని చూస్తోంది. యూఏఈ పిచ్‌లపై ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం, వ్యూహాలు రచించడం కోసం తడిని తీసుకున్నట్టు సమాచారం. అవసరమైతే బెంగళూరు తరఫున బరిలోకి దిగేందుకు రజాను సిద్ధంగా ఉంచుతోంది. గతంలో యూఏఈలో ఆస్ట్రేలియా పర్యటించినప్పుడు ఆ జట్టుకు అహ్మద్ రజా స్పిన్ సలహాదారుగా పనిచేశాడు. దాంతో బెంగళూరు బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ అతడిని సిఫార్సు చేశాడట.

శ్రీధరన్ నా గురించి చెప్పడం గొప్పగా ఉంది
'బెంగళూరు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి నన్ను పరిచయం చేశారు. బెంగళూరు బౌలింగ్ కోచ్ శ్రీధరన్ నా గురించి చెప్పడం గొప్పగా అనిపించింది. తమకు సాయం చేస్తున్నందుకు ఏబీ డివిలియర్స్ వచ్చి ధన్యవాదాలు చెబితే ఎలావుంటుందో ఊహించుకోవచ్చు. ఇదంతా నమ్మశక్యం కాకుండా ఉంది. బెంగళూరు జట్టు కోసం నా వంతు కృషి చేస్తా. జట్టు విజయాల్లో భాగమవుతా' అని యూఏఈ కెప్టెన్ అహ్మద్ రజా తెలిపాడు.

బయో బుడగ వింతగా ఉంది
'బయో బబుల్ వాతావరణం వింతగా అనిపించింది. ఇక్కడ బెంగళూరు ఉంటున్న హోటల్ అద్భుతంగా ఉంది. వాళ్ల జట్టు గది చాలా బాగుంది. ప్రత్యేకంగా హోటల్, బీచ్ సదుపాయాలు ఎన్నో అద్నుబాటులో ఉన్నాయి. ఐసీసీ అకాడమీలో తొలిసారి ప్రాక్టీస్ చేశా. సొంత ఇంటికి వచ్చినట్టే అనిపించింది' అని అహ్మద్ రజా అన్నాడు. 31 ఏళ్ల రజా 31 వన్డేలు, 41 టీ20లు ఆడాడు. 14 ఏళ్లుగా యూఏఈకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2020 కోసం యుఏఈ వెళ్లి.. భయపడుతున్న బాలీవుడ్ భామ!!