IPL 2020: సాయంత్రం వేళ.. కోహ్లీ-అనుష్క రొమాన్స్!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సతీమణి అనుష్క శర్మతో కలిసి సమయం దొరికినప్పుడల్లా దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అనుష్కతో కలిసి దిగిన ఓ అందమైన ఫొటోను ఆదివారం రాత్రి విరాట్ తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు.

నీటిలో ఎదురుగా నిలబడి:
సాయంత్రం వేళ.. నారింజ వర్ణంలోకి మారిన సూర్య కిరణాలు సాగర జలాలపై ప్రతిబింబిస్తోన్నసమయంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరినొకరు చూసుకున్నారు. భుజాల్లోతు నీటిలో ఒకరికొకరు ఎదురుగా నిలబడి ప్రేమగా చూసుకుంటుండగా.. వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ కోటలాంటి నిర్మాణం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ మధుర జ్ఞాపకాన్ని తన సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ తీసినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.

పిక్ క్రిడెట్ డివిలియర్స్
ఈ అందమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ.. పిక్ క్రిడెట్ ఏబీ డివిలియర్స్ అని కాప్షన్ ఇచ్చాడు. కోహ్లీ పోస్ట్ చేసిన కాసేపట్లోనే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. క్యూట్ కపుల్, కోహ్లీ-అనుష్క సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అనుష్క శర్మ గర్భం దాల్చినట్లు ఆగస్టు నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నారు.

2017లో వివాహం
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో తొలిసారి కలుసుకున్నారు. నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగిన విరుష్క జోడి.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. కోహ్లీతో వివాహం అయినప్పటి నుంచి అనుష్క పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు. పూర్తి సమయం కోహ్లీతోనే గడుపుతున్నారు. 32 ఏళ్ల అనుష్క శర్మ చివరిగా 'జీరో' సినిమాలో వెండితెరపై కనిపించారు.

మరో మూడు గెలిస్తే
గత 12 సీజన్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటి వరకూ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మిగిలిన ఐదు మ్యాచులలో మూడు గెలిస్తే అధికారికప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. రెండు గెలిచినా అవకాశం ఉంటుంది. బుధవారం కోల్‌కతాతో బెంగళూరు తలపడనుంది.
CSK vs RR Preview: చెన్నైతో రాజస్థాన్ ఢీ.. గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు.. ఓడితే ఇక ఇంటికే!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications