కోహ్లీ బ్యాట్స్‌ను దాస్తుంటాడు.. వాటిని ఎలాగైనా దొంగలిస్తా: డివిలియర్స్

దుబాయ్: ఐపీఎల్ పదమూడో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పంజా విసురుతోంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను వాడే బ్యాట్స్, కిట్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
బోల్డ్ డైరీస్ పేరిట ఆర్‌సీబీ యూట్యూబ్ చానెల్ నిర్వహించే కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ మాట్లాడుతుండగా మధ్యలో వచ్చిన ఏబీడీ.. కోహ్లీ తన బ్యాట్స్‌ను సీక్రెట్‌గా దాస్తుంటాడని, వాటిని ఎలాగైనా ఎత్తుకెళ్లానన్నాడు. ఈ వీడియోను ఆర్‌సీబీ ట్వీట్ చేయగా..నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ప్రతీ టూర్‌కు కొత్త కిట్..
ఈ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ఏ పర్యటనకైనా.. కొత్త కిట్‌తో సిద్దమవుతానన్నాడు. ‘ఐపీఎల్ అనే కాదు.. ఏ టూర్‌కు సన్నద్దం కావాల్సి వచ్చినా బ్యాట్ దగ్గర్నుంచి ప్యాడ్స్ వరకు కొత్త కిట్‌ను కచ్చితంగా వాడుతుంటా. టెస్టు క్రికెట్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తా.. అందుకే టెస్టులకు వాడే కిట్‌ను వన్డే, టీ20ల్లో ఉపయోగించను. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్ దుబాయ్‌లో చాలా వేడి ఉండడంతో దానికి తగ్గట్టుగానే సిద్దమయ్యా.

స్పెషల్ క్రీమ్ ఉపయోగిస్తా..
10 జతల గ్లోవ్స్ వాడాల్సి వస్తుంది. నా బ్యాట్ కిట్‌లో అన్ని వస్తువులకు సమప్రాధాన్యం ఇస్తుంటా. గ్లోవ్స్ వేసుకోవడానికి ముందు ఒక స్పెషల్ క్రీమ్ అప్లై చేస్తా.. దాని వల్ల నా చేతికి గ్రిప్ వచ్చి బ్యాటింగ్ ఇంకా బాగా చేయగలుగుతా. అంతేగాక ప్రాక్టీస్ సమయంలో మూడు రకాల బ్యాట్లను వాడడంతో పాటు ఒకే కిట్‌లో మూడు పెట్టేంత ప్లేస్‌ను ఏర్పాటు చేసుకున్నా.' అని తెలిపాడు.

ఖచ్చితంగా దొంగలిస్తా..
అయితే కోహ్లీ సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో ఏబీ డివిలియర్స్ మధ్యలో కల్పించుకొని తమ కెప్టెన్ తన బ్యాట్లను ఎవరికి తెలియకుండా సీక్రెట్‌గా దాస్తుంటాడని.. వాటిని ఎలాగైనా దొంగలించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. డివిలియర్స్ మాటలతో కోహ్లీ చిరునవ్వులు చిందించాడు. ఇక ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ను కింగ్స్ పంజాబ్‌తో గురువారం ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications