Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR: 'కమిన్స్‌ సూపరో సూపర్.. రూ.15.5 కోట్లకు న్యాయం చేశాడు'

IPL 2020: Aakash Chopra says Pat Cummins did justice to Rs 15.5 crore

దుబాయ్: కోల్‌కతా నైట్ రైడర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టకేలకు ఆ జట్టు పేసర్‌ పాట్‌ కమిన్స్‌ నిలబెట్టుకున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. కమిన్స్‌ సూపర్ అని, తనకు పెట్టిన ధరకు న్యాయం చేశాడన్నాడు. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో కోల్‌కతా ఈ ఆస్ట్రేలియా పేసర్‌ను రూ.15.5 కోట్లు వెచ్చించి అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. అయితే సీజన్‌ ఆరంభం నుంచీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కమిన్స్..‌ నిన్న తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

కోల్‌కతా చేయగలిగింది చేసింది

కోల్‌కతా చేయగలిగింది చేసింది

ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ కోల్‌కతా టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. 'బంతితో పాట్‌ కమిన్స్, బ్యాట్‌తో ఇయాన్ మోర్గాన్ అత్యుత్తమంగా ఆడారు. కోల్‌కతా అద్భుత విజయం సాధించింది. మిగతా ఆటగాళ్లు కూడా తమవంతు కృషి చేశారు. ఇప్పటికి కోల్‌కతా చేయగలిగింది చేసింది. ఇక ప్లేఆఫ్ కోసం ఎదురుచూస్తోంది. ఇతర ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ఆశగా ఉంది. అయితే అదికాస్తా కష్టమైన విషయమే' అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

కోల్‌కతా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు

కోల్‌కతా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు

'రాజస్థాన్ రాయల్స్‌ను ఆపడానికి ఏకైక మార్గం వికెట్లు తీయడమే. ఈ విషయంలో కమిన్స్‌ అద్భుతంగా పనిచేశాడు. మొదటి రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీశారు.. ఇంతకన్నా ఇంకేం కావాలి. కమిన్స్‌ 4/34 చెలరేగిపోయాడు. కీలక బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ చేర్చాడు. పాట్‌ కమిన్స్ సూపర్. కోల్‌కతా అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రూ.15.5 కోట్లకు న్యాయం చేశాడు' అని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. ఆకాశ్‌ ప్రస్తుతం ఐపీఎల్ 2020లో వ్యాఖ్యాతగా ఉన్న విష్యం తెలిసిందే.

కార్తీక్‌ క్యాచ్ అద్భుతం

కార్తీక్‌ క్యాచ్ అద్భుతం

పాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో బెన్ ‌స్టోక్స్‌ క్యాచ్‌ను వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ అద్భుతంగా అందుకున్నాడని ఆకాశ్‌ చోప్రా చెప్పాడు. ఆ తర్వాత ఈ కోల్‌కతా పేసర్‌ ఇంకో వికెట్‌ తీశాడన్నాడు. శివమ్‌ మావి సైతం సంజూ శాంసన్‌ను ఔట్ చేశాడని, దాంతో కోల్‌కతాకు భారీ ఊరటనిచ్చాడని వివరించాడు. ఇక జోస్ బట్లర్‌ కూడా వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో వెనుతిరిగాడని మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో మోర్గాన్‌, బౌలింగ్‌లో కమిన్స్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని మెచ్చుకున్నాడు.

5 ఓవర్లలోనే 5 వికెట్లు

5 ఓవర్లలోనే 5 వికెట్లు

భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు దాడి ప్రారంభించారు. ఉతప్ప ఫస్ట్ బాల్‌నే సిక్స్‌ బాదాడు. ఆ ఓవర్లో స్టోక్స్ 4, 6 బాదాడు. అయితే చివరి బంతికి ఉతప్పను కమిన్స్ ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన కమిన్స్.. తొలి బంతికే స్టోక్స్‌ను ఔట్ చేశాడు. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అమాంతం గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అదే ఓవర్ చివరి బంతికి స్మిత్‌ను కమిన్స్ బౌల్డ్ చేశాడు. కమిన్స్ తన మూడో ఓవర్ చివరి బంతికి రియాన్ పరాగ్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో రాజస్థాన్ 5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకుంది.

బీసీసీఐ స్పాన్స‌ర్‌గా ఎంపీఎల్.. రూ.120 కోట్లతో ఒప్పందం‌!!

Story first published: Monday, November 2, 2020, 17:40 [IST]
Other articles published on Nov 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+