Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RCB: 'నిజం చెప్పాలంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇంత సత్తా ఉందనుకోలేదు'

IPL 2020: Aakash Chopra says I didnt feel that the Sunrisers Hyderabad had the potential

అబుదాబి: ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గొప్పగా పుంజుకున్న విషయం తెలిసిందే. వరుస ఓటములతో ఓ దశలో దాదాపు ప్లేఆఫ్ రేసు నిష్క్రమించినట్లు కనిపించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత అద్భుత విజయాలతో రేసులోకి వచ్చింది. వరుసగా మూడు టాప్ జట్లపై విజయాలు సాధించి ప్లేఆఫ్ చేరిన వార్నర్ సేన.. గత రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి క్వాలిఫైయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే.. వార్నర్ సేన ఫైనల్ చేరుకుంటుంది. రెండోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గడానికి మరో రెండు అడుగుల దూరంలో ఉంది.

ఎవరూ ఊహించి ఉండరు:

ఎవరూ ఊహించి ఉండరు:

ఐపీఎల్ 2020లో ఫైనల్ చేరతామని ముందే చెప్పి మరీ డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ను ముందుకు నడిపిస్తుండటం విశేషం. ఇక మిచెల్ మార్ష్, భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్ లాంటి స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ.. సన్‌రైజర్స్ పుంజుకున్న తీరు అద్భుతం. ఇలా సన్‌రైజర్స్ పుంజుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. అద్భుత విజయాలు సాధిస్తున్న వార్నర్ సేనపై భారత మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు గుప్పించాడు. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇంత బాగా పుంజుకుంటుందని, ఇక్కడకి వరకూ వస్తుందని ఊహించలేకపోయానన్నాడు.

ప్లేఆఫ్ కష్టమే అనుకున్నా:

ప్లేఆఫ్ కష్టమే అనుకున్నా:

ఆకాశ్ చోప్రా తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో మాట్లాడుతూ... 'నిజాయితీగా చెప్పాలంటే.. సన్‌రైజర్స్‌కు ఇంత సత్తా ఉందని నేను అనుకోలేదు. టోర్నీలో మొదట ప్రదర్శన చూసి.. ప్లేఆఫ్ కష్టమే అనుకున్నా. ఇదో సగటు జట్టు మాత్రమే అనుకున్నాను. బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్‌ టాప్-2 లేదా టాప్-3పై ఎక్కువగా ఆధారపడుతోంది. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ మినహా మరెవరూ లేరు. అయినా గొప్పగా ఆడింది' అని అన్నాడు.

ఇంత సత్తా ఉందనుకోలేదు:

ఇంత సత్తా ఉందనుకోలేదు:

'ఇది క్రికెట్.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. బాగే ఆడే ఆటగాళ్లు అంచనాలు తప్పని తేల్చారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఇక్కడి వరకూ వస్తుందని నేను అనుకోలేదు. కానీ వారు అద్భుతంగా ఆడారు. వరుసగా నాలుగో మ్యాచ్‌ల్లో గెలవడంతో పాటు బెంగళూరును రెండుసార్లు ఓడించారు. అన్ని విభాగాల్లోనూ ఆ జట్టు బలంగా ఉంది. గాయపడిన వృద్ధిమాన్ సాహా ఆర్సీబీతో మ్యాచ్‌కు దూరమైనా.. ఆ ప్రభావం కనిపించకుండా చక్కగా గెలుపొందింది' అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.

రెండో క్వాలిఫైయర్:

రెండో క్వాలిఫైయర్:

గత ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. చివరి ఆరు మ్యాచ్‌ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మాత్రమే గెలుపొందిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం సాయంత్రం అబుదాబీలో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మంగళవారం ముంబైతో ఫైనల్‌లో తలపడనుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Women's BBL: స్టన్నింగ్‌ క్యాచ్‌.. ఇద్దరు కలిసి ఎలా పట్టారో చూడండి (వీడియో)!!

Story first published: Saturday, November 7, 2020, 17:00 [IST]
Other articles published on Nov 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+