నేనందుకే మనఃస్ఫూర్తిగా నవ్వలేనేమో: గంభీర్

న్యూఢిల్లీ: పేరుకు తగినట్లుగానే క్రికెటర్ గౌతం గంభీర్ వదనం ఎప్పుడూ గంభీరంగానే కనిపించేది. ఏ స్థాయి మ్యాచ్‌లోనైనా అతను మనసారా నవ్వడాన్ని దాదాపుగా ఎవరూ చూసి ఉండరు! ఇటీవలే రిటైర్ అయిన గంభీర్ దీనికి కారణాన్ని వెల్లడించాడు. జీవితంలో తనకు ఏదీ సునాయాసంగా దక్కలేదని, ప్రతీదాని కోసం శ్రమించాల్సి రావడంతో అదే తరహాలో ఉండటం అలవాటైందని అతను చెప్పాడు. చాలా మంది నేను నవ్వడం గురించి అడిగారు. కానీ దానికో కారణం ఉంది. అండర్-12 స్థాయి నుంచి జాతీయ జట్టులోకి వచ్చే వరకు చాలా కష్టాలు పడ్డాను.

జట్టులో చోటు కోసం పోరాడాల్సి వచ్చి
చాలా మంది నేను నవ్వడం గురించి అడిగారు. కానీ దానికో కారణం ఉంది. అండర్-12 స్థాయి నుంచి జాతీయ జట్టులోకి వచ్చే వరకు చాలా కష్టాలు పడ్డాను. బాగా ఆడినా జట్టు నుంచి తప్పించిన రోజులు, ప్రతీసారి జట్టులో చోటు కోసం పోరాడాల్సి వచ్చిన రోజులు వంటి విషాదకర ఘటనలు చాలానే ఉన్నాయి. 2007 వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోయేసరికి మరింత సీరియస్‌గా మారిపోయాను. బహుశా అదే సరదాగా గడపకపోవటానికి, నవ్వకపోవడానికి కారణమై ఉండొచ్చు.

భారీ మొత్తానికి కొనుగోలు చేయడం వల్లనే
'ఐపీఎల్‌లో కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం వల్ల నాపై తీవ్రమైన ఒత్తిడి ఉండేది. తగినంత స్వేచ్ఛ ఇచ్చినా, రెండు సార్లు టైటిల్ గెలిచినా ఆ ఒత్తిడి మాత్రం తగ్గలేదు. బహుశా షారుఖ్ కొంత తక్కువ మొత్తం ఇస్తే బాగుండేదేమో.' అని గంభీర్ వివరించాడు.

కొంతకాలం పాటు ఆలోచించాకే రిటైర్మెంట్
అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే విషయంలో తన రిటైర్‌మెంట్ గురించి రాసిన సోషల్ మీడియా పోస్టులో ఇలా పేర్కొన్నాడు. 'ఆంధ్రతో ఢిల్లీ ఆడబోయే తర్వాతి రంజీ మ్యాచే నా కెరీర్‌లో ఆఖరిది. నా కెరీర్ మొదలైన ఫిరోజ్ షా కోట్లాలోనే నా ప్రస్ధానం ముగియనుంది. రిటైర్మెంట్ ఆలోచన కొంతకాలంగా నన్ను వెంటాడుతోంది. చికాకు పరిచే అదనపు సరంజామాగా విమానాల్లోనూ నాతో ప్రయాణించింది.'

కొన్ని మనోహరమైన అధ్యాయాలు రాసినా
'నాతోపాటు సాధనకూ వచ్చింది. నన్ను వెక్కిరిస్తూనే ఉంది. ఎవరో నా కథ రాస్తున్నారనేది నా భావన. ఐతే ఇప్పుడు సిరా అయిపోయింది. కానీ ఈ క్రమంలో కొన్ని మనోహరమైన అధ్యాయాలు రాశాడు. న్యూజిలాండ్‌లో సిరీస్ విజయం, ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్ విజయం నా కథలో మధుర అధ్యాయాలే. అన్నట్లుగా అనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications