న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమానులు క్వశ్చన్స్: మెంటార్‌గా సెహ్వాగ్ ఫన్నీ సమాధానాలు

By Nageshwara Rao
IPL 2018: Virender Sehwag names two batsmen he would pick in case of a super over scenario

హైదరాబాద్: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సూపర్ ఓవర్‌ ఆడాల్సి వేస్తే బ్యాటింగ్‌కు ఎవర్ని దించుతావు? అని అభిమాని అడిగిన ప్రశ్నకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ ఠక్కున చెప్పిన సమాధానం కేఎల్ రాహుల్, క్రిస్ గేల్.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో వీరేంద్ర సెహ్వాగ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్ వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు యాజమాన్యం పంజాబ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా 'సెహ్వాగ్‌తో క్వశ్చన్‌ టు ఆన్సర్‌' అనే కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో గుండ్రటి కళ్లద్దాలే ఎందుకు పెట్టుకుంటావు?, కేఎల్‌ రాహుల్‌ ఆడిన ఓ షాట్‌కు నువ్వు ఫిదా అయ్యవు. ఎందుకంటే ఆ షాట్‌ నువ్వు క్రికెట్‌ ఆడే రోజుల్ని గుర్తు చేసిందా? అంటూ సెహ్వాగ్‌పై అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఇంతకీ అభిమానులు సెహ్వాగ్‌ను ఏమేమి ప్రశ్నలు అడిగారో... ఆయా ప్రశ్నలకు సెహ్వాగ్ ఏమని సమాధానం ఇచ్చాడో వాటికి సంబంధించిన వివరాలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం తమ అధికారిక వెబ్‌సైట్ https://www.kxip.in/ లో ఉంచింది. అవేంటో ఒక్కసారి చూద్దామా...


ప్రశ్న: డగౌట్‌లో కూర్చుని ఉంటున్నారు. ఫీల్డ్‌కు దూరమయ్యాను అన్న భావన ఎప్పుడైనా కలిగిందా?
జవాబు: నేనెప్పటికీ అర్జునిడులా ఉండాలనుకోను. ప్రస్తుతం ద్రోణాచార్యుడిగా మారాను.


ప్రశ్న: భవిష్యత్తులో ఆర్యవీర్‌, వేదాంత్‌(సెహ్వాగ్‌ కుమారులు) పంజాబ్‌, ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తే మీరు ఏ జట్టుకు మద్దతిస్తారు?
జవాబు: నా హృదయానికి దగ్గరగా ఉన్న జట్టు ఢిల్లీ. నా మనసుకు దగ్గరగా ఉన్న జట్టు పంజాబ్‌. నేను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు పని చేసే వరకు ఆ జట్టుకే మద్దతిస్తా.


ప్రశ్న: నీలాగే బ్యాటింగ్‌ చేసే సమయంలో పాట పాడటం పంజాబ్‌ జట్టులో ఎవరికైనా అలవాటు ఉందా?
జవాబు: నా అలవాటు ఎవరికీ లేదు. కానీ, వారు నేను పాడే పాటలు వింటారు. డ్యాన్స్‌లు కూడా వేస్తారు.


ప్రశ్న: ఈ ఏడాది ఏప్రిల్‌ 1న మా అందర్ని ఫూల్‌ చేశావు. పాఠశాల, కళాశాలలో చదివే రోజుల్లో కూడా ఇలా చేసేవాడివా?
జవాబు: స్కూల్లో చదివే రోజుల్లో నేను చాలా మంచి పిల్లవాడిని. చదువుకునే రోజుల్లో ఇలా చేయలేదు.


ప్రశ్న: నువ్వు గుండ్రటి కళ్లద్దాలే ఎందుకు పెట్టుకున్నావ్. హ్యారీ పోటర్‌ను చూసి స్ఫూర్తి పొందావా?
జవాబు: నేను మహాత్మ గాంధీని చూసి స్ఫూర్తి పొందాను. ఎందుకంటే నేనెంతో నిజాయతీ కలవాడిని.


ప్రశ్న: పంజాబ్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ కొట్టిన ఓ షాట్‌ చూసి నువ్వు చాలా సంతోషించావు. ఎందుకు ఆ షాట్‌ నీ క్రికెట్‌ రోజుల్ని గుర్తు చేసిందా?
జవాబు: నా రోజుల్ని ఎవరు నాకు గుర్తు చేయలేరు. రాహుల్‌ బంతిని చాలా బాగా ఆడగలడు.


ప్రశ్న: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వస్తే ఏ ఇద్దరి బ్యాట్స్‌మెన్లను, బౌలర్‌కు అవకాశం కల్పిస్తారు?
జవాబు: మా జట్టుపై నమ్మకం ఉంది. రెహ్మాన్‌ను బౌలింగ్‌ వేయిస్తా. బ్యాట్స్‌మెన్ల విషయానికి వస్తే రాహుల్‌, మన బాస్‌ క్రిస్‌ గేల్‌ని పంపిస్తా.


ప్రశ్న: సూపర్‌ ఓవర్లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 30 పరుగులు చేయాల్సి వస్తే బ్యాటింగ్‌కు ఎవర్ని దింపుతావు?
జవాబు: కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌. మూడో ఆటగాడిగా అరోన్‌ ఫించ్‌.

Story first published: Wednesday, May 2, 2018, 18:26 [IST]
Other articles published on May 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X