ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు: ఆరెంజ్ క్యాప్‌పై విరాట్ కోహ్లీ

హైదరాబాద్: తనకి ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ ధరించడం ఎంతమాత్రం ఇష్టం లేదని ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ని ఇప్పుడు కోహ్లీ సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 46 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ 62 బంతుల్లో 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 201 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు.

బెంగళూరు ఓటమిపై కోహ్లీ
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'సరైన సమయంలో మా బౌలర్లు వికెట్లు తీయలేకపోవడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది. ఫీల్డర్లు సరిగ్గా త్రోలు విసరలేకపోయారు. దీంతో ముంబై చక్కటి భాగస్వామ్యాలను నమోదు చేసింది. ఈ మ్యాచ్ విజయం వెనుక క్రెడిట్ అంతా ముంబై బౌలర్లదే' అని కోహ్లీ అన్నాడు.

ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ ధరించాలని లేదు
'నిజానికి నాకు ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ ధరించాలని లేదు. ముంబై చాలా బాగా ఆడింది. ముంబైని మొదట్లోనే రెండు వికెట్లు తీసి దెబ్బతీశాం. కానీ, ఆ తర్వాత మాకు మ్యాచ్‌ను మలుపుతిప్పే ఒక్క అవకాశాన్ని కూడా ముంబై ఇవ్వలేదు. మా బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఒకటి లేదా రెండు మంచి భాగస్వామ్యాలు నమోదైతే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది' అని కోహ్లీ అన్నాడు.

నాలుగు మ్యాచ్‌లాడగా మూడింట్లో ఓటమి
ప్రస్తుత సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. బెంగళూరు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లాడగా మూడింట్లో ఓటమిపాలైంది. టోర్నీలో భాగంగా బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 21న బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరగనుంది.

46 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి
మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై అలవోక విజయాన్ని సాధించింది. ముంబై నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20ఓవర్లలో 167/8 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ కోహ్లీ(62 బంతుల్లో 92 నాటౌట్, 7ఫోర్లు, 4సిక్స్‌లు) మినహా ఎవరూ రాణించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications