Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సో బోరింగ్: సంజూ శాంసన్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన వినోద్ కాంబ్లీ

IPL 2018: Vinod Kambli issues open challenge to Sanju Samson, indulges in Twitter war with fans

హైదరాబాద్: టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 11వ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ను (ఏప్రిల్ 24 నాటికి) దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్‌ను లక్ష్యంగా చేసుకుని వినోద్ కాంబ్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న యువ ఆటగాళ్లలో సంజూ శాంసన్ ఒకడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్లు పదే పదే సంజూ శాంసన్ పేరుని ప్రస్తావిస్తుండటంతో కాంబ్లీ వారికి మాట్లాడానికి ఇంక ఏం లేదా అంటూ ఒకరకమైన విసుగును ప్రదర్శించాడు. ఈ సందర్భంగా కాంబ్లీ ఓ సవాల్ విసిరాడు.

'నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నా.. అతడు క్లాస్ ప్లేయర్ అని ఎవరైనా చెబితే.. సంజూ సెంచరీలు బాదితే చూడాలని అనుకుంటున్నా. ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ ఎంత కాలం అతడి దగ్గర ఉంటుందో చూస్తాను. అతడు నిజంగానే గొప్పగా ఆడితే.. సంజూ స్పెషల్ అని ఒప్పుకుంటాను. ఆల్ ది బెస్ట్ సంజూ శాంసన్' అని కాంబ్లీ ట్వీట్ చేశాడు.

ఈ సీజన్‌లో మెరుగ్గా రాణిస్తోన్న సంజూ శాంసన్‌పై కాంబ్లీ ఇలా మాట్లాడటంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 'సంజూ శాంసన్ దగ్గర ఆరెంజ్ క్యాప్ ఉంది. బాగా ఆడుతున్నాడు కాబట్టే అతడి గురించి ప్రస్తావిస్తున్నారుట అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సంజూ శాంసన్‌కు టీమిండియాలో ఆడే అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Story first published: Tuesday, April 24, 2018, 15:45 [IST]
Other articles published on Apr 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+