IPL 2018: The Flop XI: జాబితాలో యువీ, స్టోక్స్... ఇంకా

హైదరాబాద్: గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ 11వ సీజన్ కోసం బెంగళూరు వేదికగా నిర్వహించిన వేలంలో ఒక్కొక్కరిని కోట్లు పెట్టి కొన్నారు. జట్టు యాజమాన్యాలు సైతం వారిపై అంచనాలు పెట్టుకున్నాయి. ఈ సీజన్ దాదాపుగా సగం పూర్తయింది.
అయినా సరే కోట్లు పెట్టిన కొన్న ఆటగాళ్లు మాత్రం ఇంతవరకూ చెప్పకోదగ్గ ప్రదర్శన చేయలేదు. వాళ్ల ఆట చూస్తేంటే జట్టు యాజమాన్యంతో పాటు ప్రేక్షకులకు కూడా విసుగు వస్తుంది. అంతేకాదు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించడం మాట అటుంచితే, ఓడిపోవడానికి కారణమవుతున్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
కోట్టు పెట్టి కొన్న ప్లేయర్లు బాగా ఆడతారనుకుంటే ప్రతి మ్యాచ్ లోనూ నిరాశగానే వెనుదిరుగుతున్నారు. మ్యాచ్‌ను విజయం దిశగా మలుపుతారనున్న ఆటగాళ్లు కనీసం పరుగులు కూడా చేయడం లేదు. ఐపీఎల్ 11వ సీజన్‌లో ఈ తరహా ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిద్దాం...

గౌతం గంభీర్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్)
ఐపీఎల్ 11వ సీజన్‌కు ముందు గౌతం గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో వేలంలో గౌతం గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం రూ. రూ.2 కోట్ల 80 లక్షలకే దక్కించుకుంది. గంభీర్ బ్యాట్స్‌మెన్‌గానే కాక కెప్టెన్‌గా కూడా ఆ జట్టుకు ఎంతో అవసరం అని యాజమాన్యం అనుకుంది. అయితే ఈ సీజన్‌లో గంభీర్ నాయకత్వంలో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. వరుస పరాజయాలను ఎదుర్కొంది. ఢిల్లీ తరుపున 6 మ్యాచ్‌లాడిన గంభీర్ మొత్తం 85 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ సీజన్‌లో గంభీర్ ప్లాప్ ఆటగాడిగా నిలిచాడు.

శిఖర్ ధావన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన శిఖర్ ధావన్ 198 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. గత 7 మ్యాచ్‌లుగా శిఖర్ ధావన్ పరుగులను చూస్తే 7, 0, 5, 11, 6, 33, 13 ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 9న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

మనీష్ పాండే (సన్‌రైజర్స్ హైదరాబాద్)
19 ఏళ్ల వయసులో 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా మనీష్ పాండే అరుదైన ఘనత సాధించాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 112.91 స్ట్రైక్ రేట్‌తో 184 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

బెన్ స్టోక్స్ (రాజస్థాన్ రాయల్స్)
ఈ సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన ఆటగాడు ఎవరన్నా ఉన్నారంటే అది బెన్ స్టోక్స్ మాత్రమే. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం బెన్ స్టోక్స్‌ను రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ నిలిచాడు. ఇప్పటివరకు బెన్ స్టోక్స్ వేలంలో అందుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోయాడు.
Batting: Matches 10: Runs: 174. Strike rate: 123.40.
Bowling: Matches: 10. Wickets: 3. Economy: 9.24.

యువరాజ్ సింగ్(కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
ఈ సీజన్‌లో ప్లాప్ అయిన ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ కూడా ఒకడు. వేలంలో యువరాజ్ సింగ్‌ను పంజాబ్ యాజమాన్యం కనీస ధరకే సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో యువరాజ్ ఇప్పటివరకు 7 మ్యాచ్(5 ఇన్నింగ్స్)ల్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. 12.80 యావరేజితో 64 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఈ సీజన్‌లో ప్లాప్ ఆటగాళ్ల జాబితాలోకి యువీ చేరాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్(ఢిల్లీ డెర్‌డెవిల్స్)
ఈ సీజన్‌లో మెరుపులు మెరిపిస్తాడని అనుకున్న ఢిల్లీ యాజమాన్యం గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 9 కోట్లకు వేలంలో దక్కించుకుంది. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటివరకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ వెలువడలేదు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 152 స్ట్రైక్ రేట్‌తో 133 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 8.18 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు.

కోరీ ఆండర్సన్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
ఇప్పటికీ ఆండర్సన్ బంతి లేదా బ్యాట్‌తో గేమ్‌ను మార్చగలిగే సత్తా ఉన్న ఆటగాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఆ రోజుని ఇప్పటికీ చూడలేకపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లాడిన ఆండర్సన్ 77.27 స్ట్రైక్ రేట్‌తో 17 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసుకున్నాడు.

వృద్ధిమాన్ సాహా(సన్‌రైజర్స్ హైదరాబాద్)
బెంగాల్‌కు చెందిన వృద్ధిమాన్ సాహా ఐపీఎల్‌లో ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఆ మేరకు ప్రభావితం చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో (9 ఇన్నింగ్స్)లో సాహాకు బ్యాటింగ్ ఆడే అవకాశం లబించింది. అయితే, సాహా మాత్రం 116 స్ట్రైక్ రేట్‌తో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు.

వాషింగ్టన్ సుందర్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
పవర్ ప్లేలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం భావించి వేలంలో అత్యధిక ధర చెల్లించి వాషింగ్టన్ సుందర్‌ను కొనుగోలు చేసింది. తమిళనాడుకు చెందిన ఈ స్పిన్నర్ ఆ మేరకు ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడిన వాషింగ్టన్ సుందర్ కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఇక, బ్యాటింగ్ విషయానికి వస్తే ఆరు ఇన్నింగ్స్‌ల్లో 171 స్ట్రైక్ రేట్‌తో 65 పరుగులు మాత్రమే చేశాడు.

మహామ్మద్ షమీ(ఢిల్లీ డేర్ డెవిల్స్)
మహామ్మద్ షమీపై అతడి భార్య హాసిన్ జహాన్ ఆరోపణలు చేయడంతో ఐపీఎల్‌కు ముందు ఇబ్బందులు సమస్యల్లో చిక్కుకున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ తరుపున కేవలం 4 మ్యాచ్‌ల్లో ఆడిన షమీ 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కూడా ఓవర్‌కు పది చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీజన్‌లో షమీ అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేశాడు.

ధావల్ కులకర్ణి(రాజస్థాన్ రాయల్స్)
ముంబైకి చెందిన ధావల్ కులకర్ణి 140 kmph వేగంతో బంతులు విసరగల సమర్ధుడు. అయితే, ఈ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు ధావల్ కులకర్ణి ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాల్లో ఏ మాత్రం కీలకపాత్ర పోషించలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications