For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: గత 11 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి

By Nageshwara Rao
IPL 2018: Teams create a unique record for the first time in 11 years

హైదరాబాద్: ఆదివారంతో ఐపీఎల్ 11వ సీజన్ లీగ్ దశ ముగిసింది. మంగళవారం నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో భాగంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.

ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌లో పాల్గొన్న అన్ని జట్లు ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాయి. ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి అన్ని జట్లు లీగ్ దశలో 10 పాయింట్లు సాధించాయి. ఐపీఎల్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.

అంతేకాదు ఈ సీజన్‌లో చాలా వరకు మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఫలితాన్ని వచ్చేలా జరిగాయి. ఈ సీజన్‌లో మరో విశేషం ఏంటంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా సూపర్ ఓవర్ ఆడకపోవడం. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు ముందు వరకు మొత్తం 56 మ్యాచ్‌లు జరిగాయి.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

వీటిల్లో ఏ ఒక్క మ్యాచ్‌ల్లో కూడా సూపర్ ఓవర్ ఆడలేదు. ఐపీఎల్ 11వ సీజన్‌ను ఎంతో ఘనంగా ఆరంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏడో స్థానంతో ముగించింది. టోర్నీలో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో బుధవారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. అనంతరం క్వాలిఫయిర్-1లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా కోల్‌కతాలోనే జరగనుంది. ఇక, పైనల్ మ్యాచ్ ఆదివారం (మే 27)న ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది.

Story first published: Monday, May 21, 2018, 16:14 [IST]
Other articles published on May 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+