For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆదివారంతో ముగిసిన ఐపీఎల్: నమోదైన అత్యుత్తమ గణాంకాలివే

By Nageshwara Rao
IPL 2018: Take a look at ipl competition statistics

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ఆదివారంతో ముగిసింది. టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన పైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడింది.

2008లో ఆరంభమైన ఈ లీగ్‌కు క్రికెట్ ప్రేమికులు బ్రహ్మరథం పట్టడంతో ప్రతిఏడాది టోర్నీ విజయవంతంగా సాగుతోంది. ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ దిశను మార్చే విధంగా ప్రభావితం చేసింది. ఏటికి ఏటికి టోర్నీపై అంచనాలు పెరిగిపోవడంతో పాటు అభిమానులను ఆకర్షించేందుకు ఆటగాళ్లు సైతం తమ శక్తివంచన లేకుండా ఆడుతున్నారు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో ఐపీఎల్ అంటేనే రికార్డులు అనేలా పేరు తెచ్చుకుంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌లో కూడా ఐపీఎల్‌లో ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను అభిమానులు వీక్షించారు. ఈ సీజన్‌లో చాలా వరకు మ్యాచ్‌లు ఆఖరి వరకు ఫలితాన్ని తేల్చే విధంగా జరిగాయి. ఈ క్రమంలో ఈ సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్‌తో పాటు పలు విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదయ్యాయి.

ఐపీఎల్ 2018 సీజన్ గణాంకాలు:

* టోర్నీలో జరిగిన మొత్తం మ్యాచ్‌లు: 60


* టోర్నీలో అందరు బ్యాట్స్‌మెన్ కలిసి చేసిన పరుగులు: 19,901


* పవర్‌ప్లేలో బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులు: 5,983


* బౌండరీల ద్వారా వచ్చిన పరుగులు: 11,840


* డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్: 67 మంది


* ఫీల్డర్లు అందుకున్న క్యాచ్‌లు: 488


* నమోదైన సెంచరీలు: ఐదు


* మొత్తం హాఫ్ సెంచరీలు: 91


* బౌలర్లు తీసిన వికెట్లు: 720


* ఫోర్ల సంఖ్య: 1,652


* సిక్సర్ల సంఖ్య: 872


* మొయిడిన్ ఓవర్లు: 14


* ఫ్రీ హిట్స్: 37


Story first published: Monday, May 28, 2018, 13:52 [IST]
Other articles published on May 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+