Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2018, SRH vs KXIP: 'కేఎల్ రాహుల్ వికెట్ ఎంతో కీలకం'

IPL 2018, SRH vs KXIP: Rashid Khan glad to take KL Rahuls wicket, calls him one of his favourites

హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ తనకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని సన్‌రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై హైదరాబాద్ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

నిజానికి ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. మిగతా జట్లతో పోలిస్తే బౌలింగ్ ప్రధానం బలంగా విజయాలను రాబడుతోంది. ప్రత్యర్ధి జట్లకు స్వల్ప లక్ష్యాలను నిర్దేశించి విజయాలు సాధిస్తోన్న తీరు నిజంగా అద్భుతం. హైదరాబాద్ బ్యాటింగ్‌లో హిట్టర్లు, భారీ పరుగులు కనిపించకుండానే జట్టు విజయాలతో దూసుకెళ్తోంది.

హైదరాబాద్ విజయాల్లో రషీద్ ఖాన్ కీలకపాత్ర

హైదరాబాద్ విజయాల్లో రషీద్ ఖాన్ కీలకపాత్ర

ఈ విజయాల వెనుక ఉన్న కీలక ఆటగాళ్లలో రషీద్‌ ఖాన్‌ కూడా ఒకడు. టోర్నీలో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్ 19 పరుగులిచ్చి మూడు వికెట్లను తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 55 పరుగుల వద్ద ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(32)ను బౌల్డ్‌ చేసి జట్టుకు చక్కటి శుభారంభాన్నిచ్చాడు.

 తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 132/6

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 132/6

ఆ తర్వాత కరుణ్ నాయ్యర్‌(13), రవిచంద్రన్‌ అశ్విన్‌(4)లను పెవిలియన్‌కు చేర్చాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ముందు ఈ లక్ష్యం చాలా చిన్నదని అంతా భావించారు.

కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ దక్కడం సంతోషం

కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ దక్కడం సంతోషం

అయితే అనూహ్యాంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ దెబ్బకు పంజాబ్ 119 పరుగులకే కుప్పకూలింది. దీనిపై మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ మాట్లమాడుతూ 'కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. అతనో క్లాస్‌ ఆటగాడు. నా అభిమాన ఆటగాళ్లలో రాహుల్‌ కూడా ఒకడు' అని తెలిపాడు.

 మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు

మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు

'జట్టు తక్కువ స్కోర్‌ చేసినప్పుడు లెంగ్త్‌ సరిగా చూసుకుని వికెట్‌ టు వికెట్‌ బంతులేయాలన్నది నా ప్రణాళిక. అలా చేస్తేనే మా జట్టు తక్కువ స్కోర్‌ చేసిన ప్రత్యర్థి జట్టు దాన్ని ఛేదించకుండా చేయగలం. గత రెండు మ్యాచ్‌ల్లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఫీల్డింగ్‌ కూడా బాగుంది. కానీ, బ్యాట్స్‌మెన్‌ మరిన్ని పరుగులు చేయాలి' అని పేర్కొన్నాడు.

Story first published: Friday, April 27, 2018, 15:26 [IST]
Other articles published on Apr 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+