Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్, SRH vs CSK: అంబటి రాయుడు రనౌట్‌పై ట్విట్టర్‌లో ఇలా!

IPL 2018, SRH vs CSK: Twitterati laments over bizarre Ambati Rayudus run out after his blitz for Chennai

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు చెలరేగాడు. సొంత మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 7.1 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న చెన్నైని అంబటి రాయుడు తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాఢు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

సురేశ్ రైనాతో కలిసి మూడో వికెట్‌కు 59 బంతుల్లోనే 112 పరుగులు జోడించాడు. ఆరంభంలో వీరిద్దరూ ఆచితూచి ఆడటంతో 10 ఓవర్లలో చెన్నై రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు మాత్రమే సాధించింది. ఆ తర్వాత అంబటి రాయుడు, సురేశ్ రైనా దూకుడు పెంచారు. ఈ క్రమంలో తన ఐపీఎల్‌ కెరీర్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు((39 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సులు))ను నమోదు చేశాడు.

రాయుడు దూకుడు చూస్తే సెంచరీ ఖాయం అనుకున్నారు చెన్నై అభిమానులు. అయితే అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. సిద్ధార్ద్ కౌల్ బౌలింగ్‌లో అంబటి రాయుడు సింగిల్ తీశాడు. తర్వాత ఫీల్డర్ ఇచ్చిన బంతిని బౌలర్ సరిగా అందుకోకపోవడంతో.. రాయుడు పరుగు కోసం ముందుకొచ్చాడు. రై

నా వారించడంతో తిరిగి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే కౌల్ వికెట్లను గిరాటేశాడు. దీంతో అవనసర పరుగుకు యత్నించి రాయుడు రనౌట్‌గా వెనుదిరిగాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాయుడు 49 పరుగుల వద్ద ఇలాగే రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చెన్నై ఓటమిపాలైంది.

రాయుడు రనౌట్‌పై సోషల్ మీడియాలో అభిమానులు కాస్తంత వినూత్నంగా స్పందిస్తున్నారు. ఈ సీజన్‌లో చెన్నై జట్టు తరుపున అద్భుతమైన ఫామ్‌ని ప్రదర్శిస్తున్న రాయుడు ఇలా రనౌట్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయ్యో పాపం రాయుడు అని ట్వీట్లు పెడుతున్నారు.

Story first published: Monday, April 23, 2018, 15:51 [IST]
Other articles published on Apr 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+