
హైదరాబాద్: మ్యాచ్ ఉత్కంఠగా మారినప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంత ప్రశాంతంగా ఉంటాడో కేన్ విలియమ్సన్ కూడా అలాగే ఉంటున్నాడని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో చివరి క్షణాల్లో జట్టు సభ్యుల్లోనూ ఉత్కంఠను తగ్గిస్తున్నాడని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
'సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఆటగాళ్లందరినీ ఒక్కతాటిపై నిలుపుతున్న శక్తి కేన్ విలియమ్సన్. గత సీజన్‌లో అతడికి తగినన్ని అవకాశాలు రాలేదు. ఈ ఏడాది వార్నర్ లేకపోవడంతో కేన్‌కు కెప్టెన్సీ దక్కింది. చక్కని ఇన్నింగ్స్‌లు ఆడుతూ అతడు తన బాధ్యతలను అద్భుతంగా నెరవేరుస్తున్నాడు' అని కేన్ విలియమ్సన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అచ్చం ధోనీలాగే విలియమ్సన్ చాలా ప్రశాంతంగా ఉంటున్నాడని గవాస్కర్ పేర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ దూరమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం విలియమ్సన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. నిలకడగా రాణిస్తూ జట్టుకు అద్భుత విజయాలను అందిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 364 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.