న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంచి బౌలరే కాదు డ్యాన్సర్‌ కూడా!: వైరల్ అవుతున్న వీడియో

By Nageshwara Rao
 Rashid Khan

హైదరాబాద్: ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ విజయాల్లో బౌలర్లదే కీలకపాత్ర. తక్కువ స్కోరుని సైతం కాపాడుకుంటున్న తీరు నిజంగా అద్భుతం. ఈ విజయాల్లో ఆప్ఘన్ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ కూడా కీలకపాత్ పోషిస్తున్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

తాజాగా రషీద్ ఖాన్‌కు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఈ వీడియోలో రషీద్ ఖాన్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. 'మీడ్ అండ్ గ్రీట్' పేరిట ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రషీద్‌ ఖాన్‌ తన సహచర ఆటగాళ్లు దీపక్‌ హుడా, సచిన్‌ బేబీతో కలిసి హాజరయ్యాడు.

ఈ నేపథ్యంలో 'బార్‌ బార్‌ దేఖో' చిత్రంలోని 'కాలా చష్మా' పాటకు డ్యాన్స్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 'రషీద్‌ ఖాన్‌... మంచి బౌలరే కాదు డ్యాన్స్‌ర్‌ కూడా' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రషీద్ ఖాన్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, May 1, 2018, 21:31 [IST]
Other articles published on May 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X