For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ల జాబితాలోకి శివమ్ మావి

By Nageshwara Rao
Shivam Mavi

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కాసుల వర్షం కురిపించే లీగ్. క్రికెట్ అభిమానులను అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందించే లీగ్. బ్యాట్స్ మన్ బ్యాట్ నుంచి ఎక్కువగా ఫోర్లు, సిక్సులు జాలు వారే లీగ్. ఇలాంటి లీగ్‌లో ఏ బ్యాట్స్‌మెన్ చాలా వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ప్రతి బంతిని బౌండరీ బాదేయాలనే కసితో బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ చేస్తుంటారు. డెత్ ఓవర్లలో పదునైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన బౌలర్లు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ల ఎదురుదాడిలో బలైన బౌలర్లు చాలా మందే ఉన్నారు.

ఆఖరి ఓవర్లలో తీవ్ర ఒత్తిడి నెలకొన్న సందర్భంలో బౌలర్లపై విరుచుకుపడటంతో ఆ జట్టు స్కోరు అమాంతం పెరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆఖరి ఓవర్లలో బౌలర్లను చితకొట్టేస్తుంటారు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆఖరి ఓవర్లను ఒక్కసారి పరిశీలిద్దాం...


అశోక్ దిండా
2017 ఏప్రిల్ 6న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ బౌలర్ అశోక్ దిండా ఆఖరి ఓవర్లో 30 పరుగులు సమర్పించుకున్నాడు. అత్యంత చెత్త రికార్డుల జాబితాలో అతడే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ముంబై యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా వరుసగా 3 సిక్సర్లు, ఒక ఫోర్, ఒక సిక్స్ బాది 30 పరుగులు రాబట్టాడు.


శివమ్ మావి
2018 ఏప్రిల్ 27న ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్ దెబ్బకు కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బౌలర్ శివమ్ మావి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఢిల్లీ చివరి ఓవర్లో జోరుమీదున్న శ్రేయస్ అయ్యర్ 4 సిక్సర్లు ఒక ఫోర్‌తో విధ్వంసం సృష్టించి 29 పరుగులు సాధించాడు. దీంతో ఢిల్లీ స్కోరు 219 పరుగులకు చేరింది.


డేవిడ్ హస్సీ
2013 ఏప్రిల్ 29న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున డేవిడ్ హస్సీ ప్రాతినిధ్యం వహించాడు. హస్సీ బౌలింగ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, పొలార్డ్ కలిసి 27 పరుగులు రాబట్టారు. దీంతో 147 పరుగుల వద్ద ఉన్న ముంబై స్కోరు ఓవర్ ఒక్కసారిగా 174కు చేరింది.


రాహుల్ శుక్లా
2013 మే 2న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు రాహుల్ శుక్లా సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్ చేతిలో బలయ్యాడు. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన యువరాజ్ సింగ్ ఆఖరి ఓవర్లో 4 సిక్సర్లు బాది 27 పరుగులు రాబట్టాడు.

Story first published: Saturday, April 28, 2018, 20:56 [IST]
Other articles published on Apr 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+