Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుమార్తె పుట్టినరోజు భావోద్వేగ వీడియో పోస్టు చేసిన ధావన్ (వీడియో)

IPL 2018: Shikhar Dhawan posts the cutest video on daughter Aliyah’s birthday

హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న శిఖర్ ధావన్‌కు ఈరోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే శనివారం (మే 5) తన కూతురు అలియా బర్త్‌డే. సరిగ్గా ఈ రోజే ఐపీఎల్‌ మ్యాచ్‌ ఉండటం వల్ల తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించే అవకాశం లేనందుకు బాధ పడుతున్నట్లు ట్విటర్‌ ద్వారా పేర్కొన్నాడు.

ప్రస్తుతం అలియా త‌ల్లితో పాటు ఆస్ట్రేలియాలో ఉంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమార్తె అలియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ భావోద్వేగభరిత వీడియోను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో అలియా చిన్ననాటి నుంచి ఒక్కో ఫొటోను ఉంచి అందమైన వీడియోను రూపొందించాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

'హ్యాపీ బర్త్‌డే మై ఏంజెల్‌. నీలాంటి మంచి మనస్తత్వమున్న కూతురు ఉన్నందుకు గర్వంగా ఉంది. ఈరోజు నీతో పాటుగా లేనందుకు చాలా బాధగా ఉంది. కానీ, మేము ఎక్కడ ఉన్నా.. మా మనసెప్పుడూ అక్కడే నీ దగ్గరే ఉంటుంది' అంటూ ధావన్‌ ట్వీట్‌ చేశాడు.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శిఖ‌ర్ ధావ‌న్ ప్ర‌స్తుతం బిజీగా ఉన్నాడు. ఈ సీజన్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ధావ‌న్ ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ శనివారం రాత్రి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌.. ఢిల్లీతో మ్యాచ్‌లో గెలిచి ఆ స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోంది.

Story first published: Saturday, May 5, 2018, 17:23 [IST]
Other articles published on May 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+