Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: 4000 పరుగుల క్లబ్‌లో శిఖర్ ధావన్

IPL 2018: Shikhar Dhawan completes 4,000 IPL runs

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో నాలుగువేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధావన్ చేరాడు.

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకు శిఖర్ ధావన్ 142 మ్యాచ్‌లాడి 4019 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధావన్ 8వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో 4953 పరుగులతో సురేశ్ రైనా అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ(4948) రెండో స్థానంలో ఉన్నాడు.

ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(4493), గౌతమ్ గంభీర్(4217), రాబిన్ ఉతప్ప(4084)లు ఉన్నారు. కాగా, ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ అత్యధిక స్కోర్ 95 కాగా మొత్తం 32 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

ఓపెనర్లు ధావన్, సాహాలు తొలి వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సాఫీగా సాగిపోతున్న హైదరాబాద్ ఇన్నింగ్స్‌ని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విడదీశాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (34), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) ఔట్ చేసి హైదరాబాద్‌ని ఒత్తిడిలోకి నెట్టాడు.

ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ తొలి బంతికి ధావన్‌ని వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. ఐదో బంతికి కేన్ విలియమ్సన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి హైదరాబాద్ 79 పరుగులు చేసింది. క్రీజులో సాహా(35), షకీబ్(5) పరుగులతో ఉన్నారు.

Story first published: Friday, May 25, 2018, 20:27 [IST]
Other articles published on May 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+