Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018 విజేత ఎవరో తెలుసా?: జ్యోతిష్కులు ఏమంటున్నారు

IPL 2018: Scientific Astrologer predicts the title winner

హైదరాబాద్: ఈ ఏడాది ఐపీఎల్ విజేత ఎవరు? ఇంకా మ్యాచ్‌లే ప్రారంభం కాలేదు.. అప్పడే విజేత ఎవరో ఎలా తెలుస్తుందనేగా మీ డౌట్. అవును మీ డౌట్ నిజమే. ప్రతి టోర్నీలో జట్ల బలబలాలు, విజయావకాశాలపై కొన్ని అంచనాలు ఉండటం సహజం. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐపీఎల్‌లో విజేత అయ్యేందుకు జట్లకు ఉన్న అవకాశాలపై ప్రముఖ జ్యోతిష్కుడు, విశ్లేషకుడు గ్రీన్ స్టోన్ లోబో చెప్పారు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

1981లో పుట్టిన కెప్టెన్లు గౌతం గంభీర్, ధోనిలు మరోసారి ట్రోఫీ నెగ్గే అవకాశం లేదని తేల్చి చెప్పాడు. దీని అర్ధం ఢిల్లీ డేర్‌ డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవడం కష్టమే అన్నమాట. అనుభవం ఉన్న కెప్టెన్లను ఈ సీజన్‌లో దూరం చేసుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు విజేతగా నిలిచే అవకాశం లేదని చెప్పాడు.

గ్రీన్‌స్టోన్ లోబో లెక్క ప్రకారం ఐపీఎల్ 11వ సీజన్‌‌లో ఇక మిగిలిన నాలుగు జట్లు.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌. ఈ నాలుగు జట్ల పోటీ ఎక్కువగా ఉన్నా ఇందులో రెండు జట్లను మాత్రం అదృష్టం వరిస్తుందని అన్నాడు.

రోహిత్ శర్మ నేతృత్వంలో వరుసగా రెండోసారి ముంబై ట్రోఫీ నెగ్గదని, గంభీర్ స్థానంలో కోల్‌కతా కెప్టెన్‌గా వచ్చిన దినేశ్ కార్తీక్ వీక్ కెప్టెన్‌గా కనిపించడం దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. జ్యోతిష్యం ప్రకారం చూసినా, అనుభవం పరంగా చూస్తే కోహ్లీ, అశ్విన్‌కు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు.

వీరి ఆటకు గ్రహబలం తోడవుతుందని.. దీంతో బెంగళూరు లేక పంజాబ్ జట్లలో ఓ జట్లు ఐపీఎల్ 11వ సీజన్‌ను కైవసం చేసుకుంటుందని లోబో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. గత పదేళ్లగా ఆడుతున్నా ట్రోఫీ అందుకోవడం కోహ్లీకి సాధ్యం కాలేదు. తొలిసారి కెప్టెన్‌ బాధ్యతలు అందుకున్న అశ్విన్‌ ఈ సీజన్‌లో తన జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తిగా మారింది.

అయితే ఐపీఎల్ 11వ సీజన్ విజేతగా ఏ జట్టు నిలుస్తుందో తెలియాలంటే మే 27 మే వరకు వేచిచూడాల్సిందే.

Story first published: Saturday, April 7, 2018, 11:29 [IST]
Other articles published on Apr 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+