Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిమానుల మనసు గెలిచిన రిషబ్ పంత్: ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం

IPL 2018: Rishabh Pants blitz takes cricketing fraternity by storm, southpaw hailed on Twitter

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ-హైదరాబాద్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్లలో యువ ఆటగాడు రిషబ్ పంత్ బౌండరీల వర్షం కురిపించాడు.

కళ్లు చెదిరే షాట్లతో అభిమానులను అలరించాడు. ఔరా అనిపించాడు. అంతేకాదు ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ (106: 59 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

రిషబ్‌ పంత్‌ మెరుపు ఇన్నింగ్స్ లేకుంటే ఢిల్లీ చాలా తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే 10 ఓవర్లలో 3 వికెట్లు చేజార్చుకున్న ఢిల్లీ చేసింది 52 పరుగులే. షకీబ్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి పృథ్వీ(9) భారీ షాట్‌కు ప్రయత్నించి శిఖర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

 అనవసర పరుగుకు ప్రయత్నించి అయ్యర్ రనౌట్

అనవసర పరుగుకు ప్రయత్నించి అయ్యర్ రనౌట్

ఆ తర్వాతి బంతికే మరో ఓపెనర్ రాయ్(11) కీపర్ గోస్వామికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన సిద్ధార్థ కౌల్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో బాదుడు ప్రారంభించాడు. అయితే సందీప్ శర్మ వేసిన ఏడవ ఓవర్‌లో అయ్యర్(3) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు.

మైదానంలో బౌండరీల వర్షం కురిపించిన రిషబ్ పంత్

మైదానంలో బౌండరీల వర్షం కురిపించిన రిషబ్ పంత్

ఆ తర్వాత హర్షల్ పటేల్(24) కూడా రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరినా, రిషబ్ పంత్ మాత్రం మైదానంలో బౌండరీ వర్షం కురిపించాడు. పుల్‌ షాట్లు, స్వీప్‌లు, స్కూప్‌లు.. ఇలా చివరి ఓవర్ వరకూ ఫోర్లు, సిక్సులతో విరుచుకు పడ్డాడు. ఆఖరి నాలుగు ఓవర్లలో అతడి విధ్వంసకం పతాక స్థాయికి చేరింది.

 20వ ఓవర్‌లో రిషబ్ పంత్ వరుసగా 4, 4, 6, 6, 6

20వ ఓవర్‌లో రిషబ్ పంత్ వరుసగా 4, 4, 6, 6, 6

భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో రిషబ్ పంత్ వరుసగా 4, 4, 6, 6, 6 బాదాడు. రిషబ్‌ పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆఖరి నాలుగు ఓవర్లలో ఢిల్లీ 67 పరుగులు సాధించింది. దీంతో 63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సులతో 128 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు.

రిషబ్ పంత్‌కి ఇదే తొలి సెంచరీ

ఐపీఎల్ కెరీర్‌లో రిషబ్ పంత్‌కి ఇదే తొలి సెంచరీ కాగా ఈ సీజన్‌లో నమోదైన మూడో సెంచరీ. టోర్నీ ఆరంభంలోనే క్రిస్‌గేల్ (పంజాబ్), షేన్ వాట్సన్ (చెన్నై) సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసినా అయినా ఫలితం లేకపోయింది.

అభిమానుల మనసులు గెలిచిన రిషబ్ పంత్

రిషబ్ పంత్ అభిమానుల మనసులు గెలిచినా.. మ్యాచ్‌ గెలిచింది మాత్రం సన్‌రైజర్స్‌ హైదరాబాదే. ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య చేధనలో శిఖర్ ధావన్‌(92 నాటౌట్‌; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్‌(80 నాటౌట్‌; 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు సూపర్‌ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ అలవోకగా ఛేదించింది.

రెండో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యం

రెండో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యం

ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆప్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు మొత్తంగా తొమ్మిదో విజయం కాగా, వరుసగా ఆరో విజయం కావడం విశేషం. తాజా ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టయింది.

Story first published: Friday, May 11, 2018, 11:23 [IST]
Other articles published on May 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+