Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మనిషా లేక పక్షా?: ఏబీ 'సూపర్‌మ్యాన్' క్యాచ్‌పై ఎవరేమన్నారు

IPL 2018, RCBvSRH: Is it a bird? Is it a plane? Its AB de Villiers - Twitter stunned after ABDs jaw-dropping catch

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ సూపర్‌ మ్యాన్‌ను తలపించాడు. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్‌తో అలెక్స్ హేల్స్‌ను పెవిలియన్ చేర్చాడు.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ బౌలర్‌ మొయిన్‌ అలీ వేసిన ఎనిమిదో ఓవర్‌ ఆఖరి బంతిని అలెక్స్‌ హేల్స్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న డివిలియర్స్‌ గాల్లో అమాంతం ఎగిరి క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకున్నాడు. ఆ క‍్రమంలోనే బౌండరీ లైన్‌ తాకకుండా తనను తాను అద్భుతంగా నియంత్రించుకున్న తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఏబీ సెన్సేషనల్‌ క్యాచ్‌తో చిన్నస్వామి స్టేడియం మార్మోగిపోయింది. డివిలియర్స్ ఒంటి చేత్తో అంత ఎత్తు ఎగిరి మరీ పట్టిన క్యాచ్ పట్ల ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏబీని సూపర్ మ్యాన్‌తో పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు స్పైడర్‌ మ్యాన్‌ను లైవ్‌లో చూశానంటూ ఏబీ క్యాచ్ అందుకుంటున్న ఫొటోను కోహ్లీ ట్వీట్ చేశాడు.

మ్యాచ్ అనంతరం ఏబీ డివిలియర్స్ సూపర్ మ్యాన్ క్యాచ్‌పై కోహ్లీ మాట్లాడుతూ 'అది ఒక స్పైడర్‌మన్‌ స్టఫ్‌. అలా ఎవరు అనుకరించకండి. అది కచ్చితంగా సిక్స్‌ అని నేను భావించా. కానీ ఏబీ అద్భుతంగా అందుకున్నాడు. అతని ఫీల్డింగ్‌ను నేను అనుకరిస్తున్నాను. హోంగ్రౌండ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌కు మద్దతు తెలిపిన అభిమానులందరికి కృతజ్ఞతలు' అని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవం చేసుకుంది. ఏబీ డివిలియర్స్ (69), మొయిన్ అలీ (65), గ్రాండ్ హోమ్ (40 చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి ఓటమి పాలైంది.

ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకి ఇది నాలుగో ఓటమి. మరోవైపు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఆరో విజయాన్ని అందుకున్న బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకి.. ప్లేఆఫ్ రేసుని మరింత ఆసక్తికరంగా మార్చేసింది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ చేరిన విషయం తెలిసిందే. టోర్నీలో భాగంగా బెంగళూరు తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.

Story first published: Friday, May 18, 2018, 12:06 [IST]
Other articles published on May 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+