Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ బెస్ట్ టీ20 స్పిన్నర్: రషీద్ ఖాన్‌పై సచిన్ ప్రశంసల వర్షం

IPL 2018: Rashid Khan is worlds best T20 spinner, says Sachin Tendulkar

హైదరాబాద్: రషీద్ ఖాన్.... ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోన్న ఆటగాడు. బౌలర్‌గా ఓ వైపు రాణిస్తూ.. అవసరమైన సమయాల్లో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు.

10 బంతుల్లో 4 సిక్సులు, రెండు ఫోర్లు బాది 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంతో పాటు... కీలక సమయంలో 3 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా అత్యుతమ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని ఆట తీరుపై పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రషీద్‌ ఖాన్‌పై పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రషీద్‌ని అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ''ఇంతకాలం రషీద్ మంచి బౌలర్ అనే అనుకున్నాను. కానీ ఇప్పుడు అతను ప్రపంచంలోనే ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమమైన స్పిన్నర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. గుర్తుంచుకోండి.. అతని గొప్ప బ్యాటింగ్ ప్రతిభ కూడా ఉంది. గ్రేట్ గాయ్'' అని సచిన్ ట్వీట్ చేశారు.

ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం చెన్నైతో తలపడుతుంది. ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరడం రైజర్స్‌కు ఇది రెండోసారి. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది.

సాహా (27 బంతుల్లో 5 ఫోర్లతో 35), ధావన్‌ (24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) రాణించగా ఆఖర్లో రషీద్‌ ఖాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో హైదరాబాద్ జట్టుని ఆదుకున్నాడు. కుల్దీప్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులకే పరిమితమైంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రషీద్‌ ఖాన్‌కు దక్కింది.

Story first published: Saturday, May 26, 2018, 10:32 [IST]
Other articles published on May 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+