Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

థ్యాంక్యూ బ్రో.. మీ సినిమాలు చూస్తుంటా: మహేష్‌ బాబుకు రషీద్ ఖాన్ ట్వీట్

IPL 2018 Qualifier 2, KKR Vs SRH: Twitter thinks Rashid Khan is from another planet after Afghans stunning show

హైదరాబాద్: రషీద్ ఖాన్.... ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోన్న ఆటగాడు. బౌలర్‌గా ఓ వైపు రాణిస్తూ.. అవసరమైన సమయాల్లో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు.

10 బంతుల్లో 4 సిక్సులు, రెండు ఫోర్లు బాది 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంతో పాటు... కీలక సమయంలో 3 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా అత్యుతమ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని ఆట తీరుపై పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

ఈ నేపథ్యంలో రషీద్‌ ఖాన్‌పై టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన రషీద్ ఖాన్‌ను టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

మహేష్ బాబు ట్వీట్‌కు రషీద్ ఖాన్ సైతం స్పందించాడు. 'థ్యాంక్యూ బ్రో మీ సినిమాలు నేను చూస్తుంటా' అని ట్వీట్ చేశాడు. ఇక, తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ సైతం మ్యాచ్‌పై స్పందించారు. మ్యాచ్‌ చూడలేపోయానని చెప్పిన కేటీఆర్, ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ అందుకోవాలని ఆకాంక్షించారు.

Story first published: Saturday, May 26, 2018, 11:51 [IST]
Other articles published on May 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+