
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ యువ ఓపెనర్ పృథ్వీ షా ఓడిన ఓ షాట్ అచ్చం ధోని హెలికాప్టర్ షాట్‌ను తలపించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పృథ్వీ షా (62: 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
తద్వారా ఐపీఎల్ చరిత్రలో పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. సీజన్‌లో అతనికిది రెండో మ్యాచ్. కేవలం 38 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా ఢిల్లీ జట్టు 219 పరుగుల భారీ స్కోరు చేయడంలో తనదైన పాత్ర పోషించాడు.
పృథ్వీ షా 18 ఏళ్ల 169 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా, శాంసన్ కూడా 18 ఏళ్ల 169 రోజుల వయసులోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 2013లో శాంసన్ ఈ ఘనత సాధించగా, పృథ్వీ షా ఆడుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ కొలిన్ మున్రోతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పృథ్వీ షా ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.
ఏమాత్రం తడబాటు లేకుండా స్వేచ్ఛగా ఆడాడు. పృథ్వీ షా ఇన్నింగ్స్‌కు కామెంటేటర్లు సైతం ముగ్ధులయ్యారు. ఇక, ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో ఒక ఫోర్ బాదిన పృథ్వీ షా.. తర్వాత బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్స్‌గా మలిచాడు. ఈ సిక్స్ మహేంద్ర సింగ్ ట్రేడ్ మార్క్ షాట్ హెలికాప్టర్ షాట్‌ని తలపించింది.
ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ఐపీఎల్ అధికారక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 164 పరుగులు చేసి ఓటమి పాలైంది.