
హైదరాబాద్: గత ఆదివారంతో ఐపీఎల్ 11వ సీజన్ ముగిసింది. రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంతో మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఈ సీజన్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. మరికొన్ని కొత్త రికార్డులు సైతం నమోదయ్యాయి. అయితే, ఈ సీజన్‌లో ఆ రెండు రికార్డుల్ని మాత్రం క్రికెట్ అభిమానులు వీక్షించలేకపోయారు. ఆ రెండు రికార్డులు ఏంటంటే సూపర్ ఓవర్, హ్యాట్రిక్ వికెట్లు. ఈ రెండు రికార్డులు ఈ సీజన్‌లో నమోదు కాలేదు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
దీంతో పాటు ఈ సీజన్‌లో నమోదైన అతిపెద్ద విజయాలివే. కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ 102 పరుగులతో గెలిచి ఈ సీజన్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 210 పరుగులు చేయగా, కోల్‌కతా 108 పరుగులకే ఆలౌటైంది.
ఐపీఎల్ 11వ సీజన్‌లో నమోదైన పలు రికార్డులివే:
* టోర్నీలో జరిగిన మొత్తం మ్యాచ్‌లు: 60
* టోర్నీలో అందరు బ్యాట్స్‌మెన్ కలిసి చేసిన పరుగులు: 19,901, అందులో బౌండరీల ద్వారా వచ్చినవే 11,840.
* పవర్‌ప్లేలో బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులు: 5,983
* బౌండరీల ద్వారా వచ్చిన పరుగులు: 11,840
* బ్యాట్స్‌మెన్ సాధించిన హాఫ్ సెంచరీలు 101, సెంచీలు 5
* డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్: 67 మంది
* ఫీల్డర్లు అందుకున్న క్యాచ్‌లు: 488
* నమోదైన సెంచరీలు: ఐదు
* మొత్తం హాఫ్ సెంచరీలు: 91
* బౌలర్లు తీసిన వికెట్లు: 720
* ఫోర్ల సంఖ్య: 1,652
* సిక్సర్ల సంఖ్య: 872
* డాట్ బాల్స్ 4,754
* మొయిడిన్ ఓవర్లు: 14, ఫ్రీ హిట్స్: 37
* చివరి బంతికి ముగిసిన మ్యాచ్‌లు 2
* ఈ సీజన్‌లో వేగవంతమైన బంతిని గంటకు 152.30 కిమీ వేగంతో రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేశాడు.
* ఈ ఐపీఎల్‌లో కోల్‌కతా ఆటగాడు సునీల్ నరైన్ 300 పరుగులు చేసి 15 వికెట్లు తీశాడు. ఈ రికార్డు అతొనక్కడి పేరిటే నమోదైంది.
* తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ రెండింట్లోనూ నలుగురు ఆటగాళ్లు బౌలర్‌కే క్యాచ్‌లు ఇచ్చారు.