For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని ఇచ్చిన ట్రిక్స్‌తోనే ఐపీఎల్‌లో రాణిస్తున్నా: ఇషాన్ కిషన్

By Nageshwara Rao
IPL 2018: Mumbai Indians Star Ishan Kishan Learnt Tricks of the Trade From MS Dhoni

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన ట్రిక్స్‌తోనే తాను సత్తా చాటుతున్నానని ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఇషాన్ కిషన్ 2016-17 రంజీ సీజన్‌లో ధోనీతో పాటు జార్ఖండ్‌కు ఆడాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఆ సమయంలో ధోని నుంచి బ్యాటింగ్‌కు సంబంధించిన కొన్ని మెళకువలు నేర్చుకున్నట్లు ఇషాన్ కిషన్ వివరించాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇషాన్ కిషన్ మాట్లాడుతూ 'నేను బ్యాటింగ్‌లో ఇంత బాగా రాణిస్తున్నానంటే ఇందుకు ప్రధాన కారణం మహేంద్ర సింగ్‌ ధోనినే' అని చెప్పుకొచ్చాడు.

'2016-17 రంజీ సీజన్‌లో ధోనీ ఉన్న జార్ఖండ్‌ జట్టులోనే నేను ఆడాను. ఆ సమయంలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న నా వద్దకు ధోనీ వచ్చి కొన్ని సలహాలు ఇచ్చాడు. బౌలర్లను ఎలా ఎదుర్కోవాలి, సుదీర్ఘ ఇన్నింగ్‌ ఎలా ఆడాలో చెప్పాడు. నా బ్యాటింగ్‌ పొజిషన్‌ను మార్చుకోమని చెప్పాడు' అని వివరించాడు.

'నన్ను ఎంతగానో గమనించిన ధోనీ ఈ విషయం నాకు చెప్పాడని అందుకే ధోని చెప్పినట్లే చేశా. ఇది నాకు ఎంతో సాయపడింది. అప్పటి నుంచి అలాగే ఆడుతున్నాను. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం అలవాటు చేసుకున్నా. యువ ఆటగాళ్లకు ఫిట్‌గా ఉండాలని ధోని సూచించేవాడు. ధోనితో ఆడిన ఆ సీజన్‌ను ఎప్పటికీ మరిచిపోలేను' అని ఇషాన్‌ తెలిపాడు.

2016-17 రంజీ సీజన్‌లో ఇషాన్ కిషన్ 57.07 యావరేజితో 10 మ్యాచ్‌లాడిన ఇషాన్‌ కిషన్ 799 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌ తరుపున 5 మ్యాచ్‌ల్లో 30.20 యావరేజితో ఇషాన్ కిషన్ 151 పరుగులు చేశాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

Story first published: Monday, April 23, 2018, 20:20 [IST]
Other articles published on Apr 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+