Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని, బ్రావో ఓ ఛాలెంజ్: ఎవరు గెలిచారో తెలుసా? (వీడియో)

IPL 2018: MS Dhoni and Dwayne Bravo challenge each other in a race after lifting the title

హైదరాబాద్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మహేంద్ర సింగ్ ధోని, డ్వేన్ బ్రావో ఓ ఛాలెంజ్‌ని స్వీకరించారు. అయితే ఈ ఛాలెంజ్‌లో ఎవరు గెలిచారనేది మీరే చెప్పాలి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 'త్రీ రన్స్‌' ఛాలెంజ్‌‌లో పాల్గొని తన సహచర ఆటగాళ్లకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

అసలేంటి ఈ 'త్రీ రన్స్‌' ఛాలెంజ్. వికెట్ల మధ్య వేగంగా మూడు పరుగులు సాధించడం. ఎవరైతే తక్కువ సమయాన్ని నమోదు చేస్తారో వారే విజేతలు. అయితే, ఇప్పుడు 'త్రీ రన్స్‌' ఛాలెంజ్‌ను ధోని, బ్రావో ఒకసారి స్వీకరించారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ధోని, బ్రావో ఒకేసారి పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ వీడియో వీక్షించాల్సిందే.

ఈ ఛాలెంజ్‌తో 30కిపైబడిన వయసులో కూడా యువ ఆటగాళ్లతో పోటీపడుతూ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ధోని, బ్రావోలు ఈ ఛాలెంజ్‌ను ఎప్పుడు స్వీకరించారంటే ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత.

అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత చెన్నై ఆటగాళ్లంతా వాంఖడె స్టేడియంలో సందడి చేశారు. ట్రోఫీతో, కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. ఆ తర్వాత బ్రావో, ధోనీ మధ్య త్రీ రన్స్‌ ఛాలెంజ్‌ నిర్వహించగా కనురెప్పపాటు సమయంలో ధోనీ ఇందులో విజయం సాధించాడు.

Story first published: Monday, May 28, 2018, 19:35 [IST]
Other articles published on May 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+