ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించిన పంజాబ్

Posted By:
IPL 2018 Live Cricket Score, Kings XI Punjab vs Delhi Daredevils: KXIP Win the Toss & Elect to Field First

హైదరాబాద్: పంజాబ్ జట్టు విజయభేరీ మోగించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ 18.5 ఓవర్లలో ఛేదించింది. కింగ్స్‌ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌(51), వేగవంతమైన ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీకి జతగా కరుణ్‌ నాయర్‌(50) అర్థ శతకం సాధించి గెలుపులో కీలక పాత్ర పోషించారు.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్:

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు 20ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడువికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెప్టెన్‌ గౌతం గంభీర్‌(55) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా, రిషబ్‌ పంత్‌(28), క్రిస్‌ మోరిస్‌(27) నాటౌట్‌లు మోస‍్తరుగా స్కోరు చేశారు.

కొలిన్ మున్రో, గంభీర్‌లు ఆరంభించారు. జట్టు 12 పరుగుల వద్ద ఉండగా మున్రో(4) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై శ్రేయస్‌ అయ్యర్‌(11), విజయ్‌ శంకర్‌(13)లు కూడా నిరాశపరిచారు. కాగా, గంభీర్‌ మాత్రం సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ గంభీర్‌ మాత్రం నిలకడగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇది గంభీర్‌కు 36వ ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ.

కాగా, జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉండగా గంభీర్‌(55) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు రిషబ్‌ పంత్‌(28) దాటిగా ఆడే క్రమంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మోరిస్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ తలో రెండు వికెట్లు సాధించగా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌కు చెరో వికెట్‌ దక్కింది.

పంజాబ్ జట్టు వర్సెస్ ఢిల్లీ జట్టు

ఐపీఎల్ లో రెండో రోజు పోరాడేందుకు నాలుగు జట్లు సిద్ధం కాగా మొదటి మ్యాచ్ పంజాబ్, ఢిల్లీల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలుచుకున్న పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్లు మ్యాచ్ కోసం పోరాడేందుకు జట్లను సిద్ధం చేస్తున్నారుక్రికెట్ పండుగ ఐపీఎల్‌లో రెండో రోజు ఆడేందుకు రెండు మ్యాచ్‌లతో లీగ్ సిద్ధమైపోయింది. మొదటి మ్యాచ్‌గా పంజాబ్, ఢిల్లీ తడపడుతుండగా రెండో మ్యాచ్‌గా కోల్‌కత్తా, బెంగుళూరులు ఆడనున్నాయి. మొదటి మ్యాచ్‌లో టాస్ గెలుచుకున్న పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

మైదానానికి బయల్దేరే ముందు పంజాబ్ జట్టు ఇలా:


స్థానిక సంస్కృతుల్ని పాటిస్తూ పంజాబ్ జట్టు మ్యాచ్‌కు వెళ్లబోతున్న ఆటగాళ్లకు బ్యాండ్ మేళంతో స్వాగతం పలికింది. ఈ సీజన్‌లో సొంత గడ్డపై తొలి మ్యాచ్‌ సందర్భంగా ఇటు ఆటగాళ్లు బసచేసిన హోటల్‌ వద్ద, అటు స్టేడియం వద్ద బ్యాండ్ల సందడి నెలకొంది. మ్యాచ్‌ ఆడేందుకుగానూ హోటల్‌ నుంచి స్టేడియంకు బయలుదేరిన ఆటగాళ్లు ఇదిగో ఇలా పంజాబీ బీట్స్‌కు అనుగుణంగా స్టెప్స్‌ వేశారు. తొలుత యువరాజ్‌, ఆ తర్వాత మిల్లర్‌, ఇంకొందరు ఆటగాళ్లు డ్యాన్స్‌ చేస్తూ సందడి చేసిన ఈ 'బల్లే బల్లే' వీడియోలను కింగ్స్‌ అఫీషియల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఆడనున్న ఇరు జట్లు:

ఢిల్లీ డేర్‌డెవిల్స్:
Gautam Gambhir (captain), Shreyas Iyer, Sandeep Lamichhane, Manjot Kalra, Glenn Maxwell, Amit Mishra, Mohammed Shami, Chris Morris, Colin Munro, Shahbaz Nadeem, Naman Ojha, Rishabh Pant, Harshal Patel, Jason Roy, Vijay Shankar, Prithvi Shaw, Rahul Tewatia, Jayant Yadav, Abhishek Sharma, Avesh Khan, Trent Boult, Daniel Christian, Sayan Ghosh, Gurkeerat Singh Mann.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
Ravichandran Ashwin (captain), Yuvraj Singh, Mayank Agarwal, Mayank Dagar, Aaron Finch, Chris Gayle, Manzoor Dar, David Miller, Mujeeb Ur Rahman, Karun Nair, Axar Patel, Lokesh Rahul, Marcus Stoinis, Manoj Tiwary, Andrew Tye, Ben Dwarshuis, Ankit Rajpoot, Pardeep Sahu, Mohit Sharma, Barinder Sran, Akshdeep Nath.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Story first published: Sunday, April 8, 2018, 15:50 [IST]
    Other articles published on Apr 8, 2018
    POLLS

    Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more