For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018, KXIP vs MI: ఓటమికి అశ్విన్ చెప్పిన కారణం ఇదీ

By Nageshwara Rao
IPL 2018, KXIP vs MI: R Ashwin blames poor batting after defeat vs MI

హైదరాబాద్: బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగానే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ అనంతరం రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ 'మేము బాగానే ఆడాం. కానీ మంచి స్కోరు సాధించలేకపోయాం. చివర్లో స్టోయినిస్‌ సమయోచితంగా ఆడకపోయి ఉంటే గౌరవప్రదమైన స్కోరు 174 పరుగులు కూడా దక్కేవి కావు' అని తెలిపాడు. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించారని అశ్విన్ కొనియాడాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

'బౌలర్లు అద్భుతంగా పోరాడారు. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. ఐపీఎల్ టోర్నీ అంత ఈజీ కాదు. 16 పాయింట్ల సాధించడం చాలా కష్టంతో కూడుకున్నది. రాబోయే 3-4 గేమ్‌ల్లో మేము అద్భుత ప్రదర్శన చేస్తేనే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాం' అని అశ్విన్ తెలిపాడు.

ఇక, కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా బాధ్యతతో కూడుకున్నదని.. ప్రస్తుతం తాను ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలనుకుంటున్నట్లు అశ్విన్‌ చెప్పాడు. ఈ ఓటమితో తామేమీ కుంగిపోవడం లేదని, తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధించడంపై దృష్టిసారిస్తామన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన ద్వారా నాకౌట్‌కు చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ముంబై ఇండియన్స్‌ శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడిపోయింది. పంజాబ్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 4 వికెట్లో కోల్పోయి చేధించింది. ముంబై ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ (57) హాఫ్ సెంచరీతో రాణించగా... ఎవిన్ లూయిస్(10), ఇషాన్ కిషన్(25), పాండ్యా (23), రోహిత్ శర్మ( 24 నాటౌట్), కృనాల్ పాండ్యా (31 నాటౌట్) పరుగులు చేశారు.

పంజాబ్ బౌలర్లలో ముజీబ్ రెండు వికెట్లు తీసుకోగా... ఆండ్రూ టై, మార్కస్ స్టోనియిస్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ 174 పరుగులు చేసింది.

Story first published: Saturday, May 5, 2018, 15:19 [IST]
Other articles published on May 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+