
హైదరాబాద్: పేసర్లకి ఎక్కువగా అనుకూలించిన పూణె పిచ్‌పై ఛేదనకు దిగిన చెన్నై బ్యాటింగ్ ఆర్డర్‌ని ధోని మార్చిన తీరు అతడిలో ఛాంపియన్‌ని మరోసారి తెలిసేలా చేసిందని పంజాబ్ హెడ్ కోచ్ బ్రాడ్ హగ్ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా పూణె వేదికగా ఆదివారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్లు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం బ్రాడ్ హగ్ మాట్లాడుతూ 'ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆధిపత్యం చెలాయిస్తూ ప్లేఆఫ్ చేరిన తీరు.. ధోని నాయకత్వానికి నిదర్శనం. పూణె పిచ్‌ని పరిశీలించిన తర్వాత.. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తాడని ముందే ఊహించాం. జట్టు విజయానికి అలా వ్యూహాలు రచిస్తాడు కాబట్టే అతను ఛాంపియన్ కాగలిగాడు' అని అన్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
'ఈ సీజన్‌లో ధోని ఛాంపియన్ జట్టుని తయారుచేశాడు. చెన్నై జట్టుకి ఉన్న అనుభవంతో పోలిస్తే పంజాబ్ జట్టుకి చాలా తక్కువ. తొలుత బ్యాటింగ్ చేస్తుండటంతో 200 స్కోరు చేయాలని ఆశించాం. అయితే.. ఆరంభంలోనే 16/3తో నిలవడం జట్టుని దెబ్బతీసింది. ఈ ఏడాది పంజాబ్ జట్టు ప్రదర్శన కూడా పడుతూ లేస్తూనే సాగింది' అని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కరుణ్ నాయర్(54) హాఫ్ సెంచరీ సాధించడంతో 19.4 ఓవర్లోనే పంజాబ్ 153 పరుగులకు ఆలౌటైంది. దీంతో 154 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు అంబటి రాయుడు (1), డుప్లెసిస్ (14) విఫలమైనా.. ప్రయోగాత్మకంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ (19), దీపక్ చాహర్ (39) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
కీలక సమయంలో వీరిద్దరూ పెవిలియన్ చేరినప్పటికీ, చివర్లో సురేశ్ రైనాతో కలిసి ధోని (16 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై రెండో స్థానంలో నిలవగా... ఏడో స్థానంలో నిలిచిన పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో మిగిలిన నాలుగో ప్లేఆఫ్ బెర్తు రాజస్థాన్ రాయల్స్‌కి ఖాయమైంది.
ప్లేఆఫ్‌లో భాగంగా మంగళవారం ధోని నాయకత్వంలోని చెన్నై జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.