న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RR మ్యాచ్ హైలెట్స్: రాజస్థాన్ ఖాతాలో చెత్త రికార్డు

By Nageshwara Rao
IPL 2018: KKR vs RR Match Highlights: Yadav helps Kolkata beat Rajasthan Royals

హైదరాబాద్: ప్లేఆప్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అద్భుత విజయం సాధించింది. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 142 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓ అరుదైన చెత్త రికార్డుని మూట గట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చినా... దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ పవర్‌ ప్లే(తొలి ఆరు ఓవర్లలో)లో 68 పరుగులు సాధించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. దీంతో పవర్‌ ప్లేలో 60పైగా పరుగులు సాధించి చివరకు అత్యల్ప స్కోరును సాధించిన జట్ల జాబితాలో రాజస్థాన్‌ రెండో స్థానంలో నిలిచింది.

ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ ప్లేలో 60కిపైగా పరుగులు సాధించి అతి తక్కువ స్కోరు నమోదు చేసిన జట్ల జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (131-2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాన్ని రాజస్థాన్ రాయల్స్ మంగళవారం నాటి మ్యాచ్‌తో ఆక్రమించింది.

ఇక మూడో స్థానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌(144-2010లో ముంబై ఇండియన్స్‌పై‌) ఉండగా, నాలుగో స్థానంలో డెక్కన్‌ చార్జర్స్‌(146-2011లో చెన్నై సూపర్ కింగ్స్‌పై) కొనసాగుతోంది. ఐదో స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్(147-2008లో చెన్నై సూపర్ కింగ్స్‌పై) ఉంది.

దీంతో పాటు 50కి పైగా ఓపెనింగ్‌ భాగస్వామ్యం వచ్చిన తర్వాత అత్యల్ప స్కోరుకు పరిమితమైన రెండో జట్టుగా కూడా రాజస్థాన్ రాయల్స్ నిలవడం విశేషం. ఈ జాబితాలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. గతేడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 55 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం సాధించినప్పటికీ, 119 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Wednesday, May 16, 2018, 15:15 [IST]
Other articles published on May 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X