న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

IPL 2018 KKR vs RCB: AB de Villiers takes a stunning catch, dismisses Chris Lynn

హైదరాబాద్: ఐపీఎల్ అద్భుతాల్లో ఇదొకటి. సాధారణంగా ఆటగాళ్లకు గాయాలు కావడం పరిపాటే. కానీ, జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి తప్పుకునే ప్రయత్నం చాలా తక్కువమంది మాత్రమే చేయగలరు. అలాగే డివిలియర్స్ పడిపోతూ బ్యాలెన్స్ చేసుకుని గాయం జరగకుండా చూసుకున్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

క్రీజులో మెరుపు వేగంతో పాదాల కదలికలను మార్చుకునే అతన్ని.. అభిమానులు ముద్దుగా '360 డిగ్రీలు' అని పిలుచుకుంటారు. ఆదివారం రాత్రి గాయపడే ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. ఐపీఎల్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయానికి చివరి 15 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి వచ్చింది.

డివిలియర్స్ క్యాచ్ పట్టిన వీడియో

ఈ దశలో క్రిస్‌వోక్స్ విసిరిన బంతిని హిట్టర్ రసెల్ లాంగాన్ దిశగా గాల్లోకి లేపేశాడు. దీంతో.. ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఏబీ డివిలియర్స్ క్యాచ్ కోసం పరుగెత్తుకుంటూ రాగా.. ఆ క్యాచ్ కోసమే.. మిడ్ వికెట్ నుంచి మెక్‌కలమ్ కూడా వచ్చాడు. అయితే.. ముందుగా అక్కడికి వచ్చిన ఏబీ డివిలియర్స్ క్యాచ్ అందుకోగా.. బంతిని మాత్రమే చూస్తూ వచ్చిన మెక్‌కలమ్ వేగంగా వచ్చి ఏబీ కాళ్ల‌కి అడ్డంగా పడిపోయాడు.

ప్రమాదాన్ని పసిగట్టిన ఏబీ డివిలియర్స్ సమయస్ఫూర్తితో వ్యవహరించి మెక్‌కలమ్‌పై అడుగుపెట్టకుండా.. పక్కకి ఎగిరాడు. రెండేళ్లుగా వెన్నునొప్పితో బాధపడిన డివిలియర్స్ ఇటీవల కోలుకున్నాడు. గత ఏడాది ఐపీఎల్‌లో కూడా ఈ నొప్పి కారణంగానే కొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఎట్టకేలకి ఏబీ చురుకుదనం కారణంగా.. ఇద్దరూ ప్రమాదం నుంచి బయటపడటంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Story first published: Monday, April 9, 2018, 13:20 [IST]
Other articles published on Apr 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X