Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గేల్‌, రాహుల్‌‌‌పైనే ఎక్కువగా ఆధారపడ్డాం: పంజాబ్‌ కోచ్‌ బ్రాడ్‌ హడ్జ్‌

Brad Hodge

హైదరాబాద్: ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎక్కువగా ఓపెనర్లు క్రిస్‌గేల్‌, కేఎల్‌ రాహుల్‌పై ఆధారపడుతున్నది నిజమేనని ఆ జట్టు హెడ్ కోచ్‌ బ్రాడ్‌ హడ్జ్‌ అంగీకరించాడు. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ 'కేఎల్‌ రాహుల్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. ఇక క్రిస్‌గేల్‌ ఊపుమీదుంటే ఏదైనా జరగొచ్చు. మంచి నైపుణ్యమున్న ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. ఇప్పుడున్న దానికంటే వారు ఇంకాస్త ఎక్కువగా రాణించాలని మేం కోరుకుంటున్నాం' అని అన్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

'రాహుల్‌ మ్యాచ్‌ గెలిపించేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. కానీ, అతడికి ఎవరూ సహకారం అందించేలేకపోయారు. మిడిలార్డర్ మెరుగ్గా ఉండుంటే మేం మ్యాచ్‌ గెలిచేవాళ్లం. చివరి ఓవర్లలో రాహుల్‌ మరికాస్త దూకుడుగా ఆడే అవకాశం ఉన్నప్పటికీ, అతని వికెట్‌ చేజార్చుకుంటే పరిస్థితి మరోలా ఉండేది' అని హడ్జ్‌ తెలిపాడు.

ఇక, బౌలింగ్ విషయానికి వస్తే పంజాబ్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని కొనియడాడు. 'ప్రస్తుతానికి మా బౌలింగ్‌ విభాగం ఫర్వాలేదు. చక్కటి బంతులు వేస్తున్నారు. అందరూ కూడా మెరుగ్గా రాణిస్తున్నారు' అని హడ్జ్‌ వెల్లడించాడు. కాగా, జైపూర్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 15 పరుగులు తేడాతో ఓడిపోయింది.

ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ 70 బంతుల్లో 95 పరుగులతో చివరి వరకు పోరాడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.

Story first published: Wednesday, May 9, 2018, 22:48 [IST]
Other articles published on May 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+