హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం: సన్‌రైజర్స్ కోచ్

హైదరాబాద్: హైదరాబాదీ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమని ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న టామ్ మూడీ చెప్పుకొచ్చాడు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ఏసిక్స్ షూస్ దుకాణంలో వీళ్లిద్దరు సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనతో పాటు కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
ఈ సందర్భంగా 1984లో తొలిసారి భారత్‌కు వచ్చానని టామ్ మూడీ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు. 'తొలిసారి భారత్‌కు వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఒకేలా అనిపిస్తోంది. హైదరాబాద్ ప్రత్యేకమైన నగరం. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా బిర్యానీ కోసమే ఆరా తీస్తా. హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం' అని అన్నాడు.

కోచ్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలి
'కోచ్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత క్రికెటర్లలో నాకు ధోని నచ్చుతాడు. వీలు దొరికితే ఎక్కువగా నిద్రపోతా. మా జట్టు ప్రదర్శన బాగానే ఉంది. కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో మెరుగవ్వాలి. గత రెండు దశాబ్దాల్లో భారత క్రికెట్‌లో గణనీయమైన మార్పులు జరిగాయి' అని టామ్ మూడీ పేర్కొన్నాడు.

హైదరాబాద్‌కు రావడం సంతోషంగా ఉంది
ఇక, సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ 'హైదరాబాద్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉంది. నగరానికి ఎప్పుడు వచ్చిన ఇక్కడి అభిమానులు ప్రేమను చూపుతూనే ఉంటారు. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న అభిమానుల సమక్షంలో మ్యాచ్ ఆడడం గొప్ప అనుభూతి. నాకు క్రికెట్లో సచిన్ అంటే చాలా ఇష్టం' అని అన్నాడు.

బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు
'ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి నిత్యం సాధన చేస్తూ ఉంటా. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ మంచి ప్రదర్శన చేస్తోంది. బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాట్స్‌మన్ కూడా గాడిన పడితే మాకు తిరుగుండదు. ఈ సారి ఐపీఎల్ టైటిల్ నెగ్గేందుకు వంద శాతం ప్రయత్నిస్తాం' అని చెప్పాడు.

ఢిల్లీతో మ్యాచ్‌కు భువనేశ్వర్ సిద్ధం
గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమైన ప్రధాన పేసర్ భువీ ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపాడు. 'ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో మ్యాచ్‌కు మరో రెండు రోజుల సమయం ఉంది. భువీ రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే అదేమంతా తీవ్రమైన గాయం కాదని అనుకుంటున్నా, కానీ అతనికి విశ్రాంతి అవసరమని భావించాం. వచ్చే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడు' అని విలియమ్సన్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications