క్రెడిట్ అంతా వారిద్దరిదే!: గొప్ప ఇన్నింగ్స్‌పై ఇషాన్ కిషన్

హైదరాబాద్: రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనిల వల్లే తాను మంచి ఇన్నింగ్స్ ఆడగలిగానని ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ముంబై నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమవడంతో 18.1 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
21 బంతుల్లో 62 పరుగులు చేసిన ఇషాన్ కిషన్
21 బంతుల్లో 62 పరుగులు చేసి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్ కిషన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ 'యువ ఆటగాడిపై జట్టు కెప్టెన్, యాజమాన్యం నమ్మకం ఉంచి ముందు వరుసలో బ్యాటింగ్ పంపించడం పట్ల ఆనందంగా ఉంది' అని తెలిపాడు.
ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడటానికి ఇద్దరు కారణం
'ఈ మ్యాచ్‌లో నేను ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడటానికి ఇద్దరు కారణం. ఒకరు రోహిత్ శర్మ కాగా మరొకరు మహేంద్ర సింగ్ ధోనీ. టోర్నీలో భాగంగా ముంబw-చెన్నై మధ్య రెండో మ్యాచ్ అనంతరం నేను కొద్ది సమయం ధోనీతో మాట్లాడాను. అతనిచ్చిన సలహాలు, సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి' అని పేర్కొన్నాడు.

ధోనీని ఎప్పుడు కలిసినా చాలా నేర్చుకుంటా
'ధోనీని నేను ఎప్పుడు కలిసినా చాలా నేర్చుకుంటాను. అతనో దిగ్గజ క్రికెటర్. మ్యాచ్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మన ఆట తీరు మారాలని సూచించాడు. ధోనీ నాతో మాట్లాడిన తీరు నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. అలాగే రోహిత్ శర్మ కూడా నాకు ఎప్పుడు మద్దతిస్తూనే ఉంటాడు' అని ఇషాన్ కిషన్ వెల్లడించాడు.

నీపై నువ్వు నమ్మకం ఉంచుకో
ఈ ఇద్దరు కూడా ‘ఏదో ఒక రోజు గొప్ప ఇన్నింగ్స్ ఆడతావు. నీపై నువ్వు నమ్మకం ఉంచుకో' అని చెబుతుండేవారని ఇషాన్ అన్నాడు. తాజా విజయంతో ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా... ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్‌కతా సంక్షిష్టం చేసుకుంది.

కోల్‌కతాపై 18 సార్లు గెలిచిన ముంబై
ఐపీఎల్‌లో కోల్‌కతాతో 23 మ్యాచ్‌లాడిన ముంబై 18 సార్లు గెలవడం విశేషం. చివరి 8 మ్యాచుల్లోనూ కోల్‌కతాపై ముంబై విజయం సాధించింది. టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబై సొంత మైదానం వాంఖడెలో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications