
హైదరాబాద్: సోమవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, బెంగళూరు జట్టు అభిమానులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. అంతేకాదు ప్లేఆప్స్‌కు చేరే అవకాశం ఆర్‌సీబీకి ఉందని ట్విట్టర్‌లో ట్వీట్లు పెడుతున్నారు.
తాజాగా, మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలపై లెక్కలు గట్టిన అభిమానులు వాటిని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన బెంగళూరు మూడింట విజయం సాధించి 6 పాయింట్లతో ఆరోస్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
అయితే అభిమానుల లెక్క ప్రకారం బెంగళూరు జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలు అనుకూలంగా ఉంటే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక వేళ మూడు మ్యాచ్‌ల్లో బెంగళూరు జట్టు గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ ఆధారంగా ఫ్లే ఆఫ్స్‌కు చేరుకున్ అవకాశం ఉందని ఆర్‌సీబీ అభిమానులు వాదిస్తున్నారు.
అభిమానుల అంచనా ప్రకారం టోర్నీలోని ఇతర జట్లు అయిన ముంబై ఇండియన్స్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలవాలి. కోల్‌కతా, ఢిల్లీ డేర్ డెవిల్స్ కనీసం మూడు మ్యాచ్‌లు ఓటమిపాలవ్వాలి. రాజస్థాన్ అన్ని మ్యాచ్‌లు ఓడితేనే బెంగళూరు ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ఆర్‌సీబీ అభిమానులు కోరుకునే విధంగా జరగడం అసాధ్యమనే చెప్పాలి.
ఏమో! కొంచెం అదృష్టం కలిసొస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫ్లే ఆఫ్స్ అవకాశం లభించవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కకు సంబంధించి పేపర్‌పై రాసి ఉన్న ఇమేజిని శ్రీహరి రామన్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అది మీకోసం ....
Here are the desired results for RCB based on thsese calculations:
# RCB win their next four matches and finish 4th with 14 points.
# Mumbai Indians need to win only 2 of their next four matches.
# Kolkata Knight Riders, Delhi Daredevils need to lose all but one matches.
# Rajasthan Royals need to lose all their remaining matches.