భయపడకుండా ఆడితేనే: జట్టులోని సహచర ఆటగాళ్లకు రోహిత్ హితబోధ

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజనులో వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడగా ఐదింట ఓటమి, ఒక్క దాంట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
దాంతో రోహిత్ సేన ఇక నుంచైనా తమ ఆట తీరులో మార్పు రావాలని ఆశిస్తోంది. అంతేకాదు టోర్నీలో ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ముంబై ఇండియన్స్ ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఈ క్రమంలోనే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని ప్రతి ఆటగాడు భయపడకుండా ఆడాలని సూచించాడు
'మేము గాడిలో పడతామని అనుకుంటాన్నా. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ మాకు కీలకమే. ముందుగా ఓడిపోతున్నామనే ఆలోచన నుంచి బయటకు రావాలి. ఎప్పుడైతే భయపడకుండా ఆడతామో.. అప్పుడే మా నుంచి అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది. నేను మా జట్టు నుంచి ఆశించేది ఇదే. ఇప్పటికైనా సమష్టి ప్రదర్శనతో ముందుగా సాగుదాం' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోని ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇకపై ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్‌లో ఆటగాళ్లు కనీసం 10 శాతం మెరుగుదల చూపించినా.. కచ్చితంగా ఈ మ్యాచ్‌లో మేము అనుకున్న ఫలితాన్ని సాధించినట్లేనని రోహిత్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications