For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో వికెట్‌కు 173 పరుగులు: కేన్-ధావన్‌లపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం

By Nageshwara Rao
IPL 2018, DD vs SRH: Twitter reacts as Sunrisers Hyderabad knock Delhi Daredevils out of the tournament

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. గురువారం రాత్రి ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆప్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు మొత్తంగా తొమ్మిదో విజయం కాగా, వరుసగా ఆరో విజయం కావడం విశేషం. తాజా ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టయింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 15 పరుగుల వద్ద అలెక్స్‌ హేల్స్‌(14) వికెట్‌ను కోల్పోయింది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్‌ విలియమ‍్సన్‌, ఓపెనర్ ధావన్‌తో కలిసి హైదరాబాద్‌కు విజయాన్నందించాడు. శిఖర్ ధావన్‌(92 నాటౌట్‌; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్‌(80 నాటౌట్‌; 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు మొత్తంగా తొమ్మిదో విజయం కాగా, వరుసగా ఆరో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 50 బంతుల్లో 92 పరుగులు చేసిన ధావన్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. దీంతో ధావన్-కేన్ విలియమ్సన్ ప్రదర్శనలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Friday, May 11, 2018, 13:24 [IST]
Other articles published on May 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+