For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్‌ గర్వపడేలా చేయండి: సన్‌రైజర్స్‌కి వార్నర్ సందేశం

By Nageshwara Rao
IPL 2018: David Warner wishes SRH all the luck ahead of the crucial clash

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టు సభ్యులకు సందేశం పంపాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

ఈ రాత్రి జరిగే మ్యాచ్‌ కోసం తన జట్టుకు గుడ్ లక్ చెప్పిన వార్నర్.. హైదరాబాద్ గర్వించేలా చేయాలని తన సహచర ఆటగాళ్లకు పిలుపునిచ్చాడు. ఈ మేరకు డేవిడ్ వార్నర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ పోస్టు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కి ముందు కూడా వార్నర్ సన్‌రైజర్స్ ఆటగాళ్లను ఉద్దేశించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 'జెంటిల్మెన్ బాగా ఆడండి విలియ్సన్ జట్టును అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు' అని వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

సన్‌రైజర్స్ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 139 పరుగులు చేయగా.. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

92 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న చెన్నైని... చివరి మూడు ఓవర్లలో డుప్లెసిస్ దూకుడుగా ఆడి విజయతీరాలకు చేర్చాడు. సఫారీ గడ్డపై ఆతిథ్య దక్షిణాప్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.

Story first published: Friday, May 25, 2018, 18:14 [IST]
Other articles published on May 25, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+