
హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ తుది దశకు చేరుకుంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్స్‌కి దూసుకెళ్లాలని రెండు జట్లు భావిస్తున్నాయి. కాగా, ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌కి ముందు సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు.
ట్విట్టర్ వేదికగా జట్టు సభ్యులకు తన సందేశాన్ని అందించాడు. 'సన్‌రైజర్స్‌కి ఈ రోజు రాత్రి మ్యాచ్‌కి గుడ్ లక్, అద్భుతంగా అడండి. కేన్ నేతృత్వంలో జట్టు ఇప్పటివరకూ అద్భుతంగా ఆడింది' అని డేవిడ్ వార్నర్ ట్వీట్ చేశాడు. సఫారీ గడ్డపై కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాప్ట్‌లపై ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో డేవిడ్ వార్నర్ ప్రస్తుతం నిషేధాన్ని ఎదురుకుంటున్నాడు. ఈ కారణంగా వార్నర్, స్మిత్‌లను ఐపీఎల్ నుంచి కూడా నిషేధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.