
హైదరాబాద్: ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న క్రిస్ గేల్ కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని ఓపెనర్ కేఎల్ రాహుల్ కొనియాడాడు. అంతేకాదు క్రిస్‌గేల్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగడంతో తన పని సులువైందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు.
ప్రత్యర్థి బౌలర్లంతా గేల్‌పై దృష్టి సారించడంతో ఒత్తిడి తగ్గి తాను బ్యాటింగ్ సులువుగా చేస్తున్నానని తెలిపాడు. ఎప్పుడూ నవ్వుతూ ప్రత్యర్థులను ఎదుర్కొంటూ ప్రేక్షకులను అలరించే క్రిస్ గేల్‌ను చూసి తాను చాలా నేర్చుకుంటున్నట్టు కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
'మేమిద్దరం ఆర్‌సీబీ తరఫున కొన్నాళ్లు కలిసి ఆడాం. ఈ ఐపీఎల్ సీజన్‌లో గేల్ నుంచి చాలా నేర్చుకుంటున్నా. గేల్ మంచి ఎంటర్‌టైనర్. అతను ఎప్పుడూ నవ్విస్తూ ఉండే క్రికెటర్. ఎప్పుడూ చిరునవ్వుతో సహచరుల్ని పలకరిస్తూనే ఉంటాడు. అత్యంత వినోదాన్ని అందించే క్రికెటర్లలో గేల్ ఒకడు' అని అన్నాడు.
'ప్రపంచ క్రికెట్‌లో ప్రమాదకరమైన ఓపెనర్. మేమిద్దరం ఒకర్నొకరం అర్థం చేసుకొని ఓపెనింగ్ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నాం. నా బ్యాటింగ్ తీరు, బంతిని బాదుతున్న విధానంపై సంతోషంగా ఉన్నా. ఇంకా నేర్చుకుంటూ మెరుగవుతున్నా. ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్‌కు ఆడుతున్న గేల్.. నా పని సులువు చేశాడు' అని అన్నాడు.
'ప్రత్యర్థి జట్లు గేల్‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. దీంతో అవతలి ఎండ్‌లో ఉండే నాకు ఒత్తిడి తగ్గింది. ఒక్క మాటలో చెప్పాలంటే గేల్ నా పని సులువు చేశాడు. అతనితో కలిసి క్రికెట్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. రెండు మూడు హాఫ్ సెంచరీలు చేసినా, ఇన్నింగ్స్ చివరి వరకూ క్రీజులో ఉండాలని ప్రయత్నిస్తున్నా. ఇక ఇప్పటికైతే నా దృష్టంతా ఐపీఎల్‌పైనే' అని రాహుల్ తెలిపాడు.
ఇక, ఐపీఎల్‌లో వికెట్ కీపింగ్ చేయడంపై 'టీ20ల్లో వికెట్ కీపింగ్‌ను ఆస్వాదిస్తున్నా. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వికెట్ల వెనకాల ఉండి పిచ్‌ను అర్థం చేసుకుంటున్నా. బంతి గమనాన్ని పరిశీలిస్తూ లక్ష్య ఛేదనలో నా ఇన్నింగ్స్‌కు సిద్ధం అవుతున్నా. అశ్విన్ చాలా తెలివిగా కెప్టెన్సీ వహిస్తున్నాడు. అందరితో చక్కగా కలిసిపోయాడు' అని పేర్కొన్నాడు.
'ఇక మా డైరెక్టర్ వీరేంద్ర సెహ్వాగ్ నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. సెహ్వాగ్ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. ఇక, విదేశీ ఆటగాళ్లూ సెహ్వాగ్ వద్దకు వచ్చి నేర్చుకుంటున్నారు. డాషింగ్ ఓపెనర్, భారత్ తరఫున రికార్డులు సృష్టించిన సెహ్వాగ్ నుంచి ఎవరైనా ఎంతోకొంత నేర్చుకుంటారు. సెహ్వాగ్ స్వేచ్ఛ ఇవ్వడంతో డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం చక్కగా ఉంది' అని అన్నాడు.
ఈ సీజన్‌లో క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ ఇద్దరూ పంజాబ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకూ పంజాబ్ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడిన గేల్ మూడు విజయాలను సాధించి పెట్టాడు.