Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: తాత వేషంలో ఆసీస్ క్రికెటర్ బ్రెట్ లీ (వీడియో)

Brett Lee

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ తరుపున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం తాత వేషం ధరించి ముంబైలో చిన్నారులతో సరదాగా క్రికెట్‌ ఆడి సందడి చేశాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

మేకప్ రూమ్‌లో కొన్ని నిమిషాల పాటు శ్రమించి ప్రత్యేక వేషధారణతో దర్శనమిచ్చాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా చిరిగిన దుస్తులు ధరించి ముసలి తాత వేషంలో ఓ క్రికెట్ మైదానానికి కూడా వెళ్లాడు. అంతేకాదు క్రికెట్‌ గురించి తనకేం తెలియదన్నట్లు.. వారి నుంచి టిప్స్‌ అడిగి తెలుసుకున్నాడు.

కొద్దిసేపు వాళ్లకు బౌలింగ్ చేశాడు. అలా కొంతసేపు చిన్నారులతో క్రికెట్ ఆడిన తర్వాత వాళ్లందరినీ ఒక దగ్గరకు రమ్మని తన మేకప్, వేషధారణను తీసేశాడు. బ్రెట్ లీని చూసిన చిన్నారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత వారందరికీ బ్రెట్ లీ ఆటోగ్రాఫ్స్‌ ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియోని స్టార్‌ స్పోర్ట్స్‌ తమ అధికారికి ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్ అయింది.

Story first published: Saturday, April 28, 2018, 21:32 [IST]
Other articles published on Apr 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+