ఈ సీజన్‌లో మూడోసారి: మొన్న ధోని... నిన్న రహానే

హైదరాబాద్: క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అభిమానులు అత్యుత్సాహాం ప్రదర్శించి భద్రతా సిబ్బందిని దాటుకుని వచ్చి మరీ తమ అభిమాన క్రికెటర్లను కలవడం చాలా సార్లు చూస్తుంటాం.ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్-చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో డగౌట్‌లో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీతో ధోనితో సంభాషిస్తున్న సమయంలో ధోని వద్దకు ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి పాదాలకు నమస్కరించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. అయితే ఈసారి వచ్చింది ధోని కోసం కాదు, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే కోసం. టోర్నీలో భాగంగా మంగళవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి.

రహానే చేయి పట్టుకున్న అభిమాని
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 158 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేదిస్తున్న క్రమంలో ఓ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకుని వచ్చి రహానే చేయి పట్టుకున్నాడు. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. అనంతరం మ్యాచ్‌ని తిరిగి కొనసాగించారు.

15 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం
ఈ సంఘటన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రాయల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.
చెన్నైతో జరిగే మ్యాచ్‌లో పింక్ జెర్సీలో రాజస్థాన్
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పింక్ జెర్సీలో ఈ మ్యాచ్ ఆడనుంది. ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త జెర్సీని బుధవారం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే ఆవిష్కరించాడు.
క్యాన్సర్ రహిత సమాజం కోసం
ఈ సందర్భంగా రహానే మాట్లాడుతూ 'ఒక ఆటగాడిని ఈ పని చాలా చిన్నదిగా నాకు అనిపిస్తుంది. కానీ క్యాన్సర్ రహిత సమాజం కోసం మేం చేసే ఈ పని చాలా కీలకమైనది. రాబోయే మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రజల్లో క్యాన్సర్‌పై పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలి అని భావిస్తున్నా' అని అన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications