For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ, గిల్‌క్రిస్ట్‌లను రిషభ్ పంత్ అధిగమిస్తాడు: పాక్ మాజీ క్రికెటర్

Inzamam-ul-Haq says Rishabh Pant can leave behind MS Dhoni and Adam Gilchrist

కరాచీ: టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్ రిషభ్‌ పంత్‌‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ ఇదే జోరు కొనసాగిస్తే ప్రపంచ దిగ్గజ వికెట్ కీపర్లు మహేంద్ర సింగ్ ధోనీ, ఆడం గిల్‌క్రిస్ట్‌లను అధిగిమిస్తాడన్నాడు. ఇటీవల పంత్‌ అన్ని ఫార్మాట్లలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పంత్ వరుసగా హాఫ్ సెంచరీలు బాదాడు. మూడో వన్డేలోనూ పంత్‌(40 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 77) దంచికొట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఇంజమామ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ రిషభ్ పంత్‌ను కొనియాడాడు. 'టీమిండియాకు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌లో దూకుడు తీసుకొచ్చింది రిషభ్‌పంత్‌. అతని వల్లే టీమిండియా రన్‌రేట్‌ పెరిగింది. పంత్‌ని కొద్దికాలంగా ఫాలో అవుతున్నా. భిన్న స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తూ అద్భుతంగా పరుగులు చేస్తున్న తీరు అమోఘం. అతను ఆడే విధానం, పరుగులు చేసే తీరు.. గత 30 ఏళ్లలో నేను ఇద్దరిలోనే చూశాను. వాళ్లే ధోనీ, గిల్‌క్రిస్ట్‌. ఈ ఇద్దరు వికెట్‌కీపర్లూ మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల సమర్థులు. పంత్‌ ఇలాగే కొనసాగితే వాళ్లిద్దర్నీ అధిగమిస్తాడు. తాజా మ్యాచ్‌లో పంత్ అద్బుతంగా ఆడాడు. పాండ్యాతో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ తొమ్మిదన్నర ఓవర్లలోనే ధాటిగా ఆడుతూ భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.'అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.

డిసైడర్ వన్డేలో రిషభ్ పంత్(62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78), హార్దిక్ పాండ్యా(44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64), శిఖర్ ధావన్(56 బంతుల్లో 10 ఫోర్లతో 67) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ ముందు భారత్ 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివర్లో శార్దూల్ ఠాకూర్ (21 బంతుల్లో 3 సిక్స్‌లతో 1 ఫోర్‌తో 30) కూడా మెరుపులు మెరిపించాడు. కానీ ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 28 పరుగులకే ఓపెనర్లు బెయిర్ స్టో(1), జాసన్ రాయ్(14) వికెట్లును కోల్పోయింది. ఈ ఇద్దరిని భువీ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక భువి బౌలింగ్‌‌లోనే స్టోక్స్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను హార్దిక్ పాండ్యా నేలపాలు చేశాడు. క్రీజులో స్టోక్స్(25)తో పాటు డేవిడ్ మలన్(4) ఉన్నాడు.

Story first published: Sunday, March 28, 2021, 18:40 [IST]
Other articles published on Mar 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+