For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిటైర్మెంట్ ప్రకటించి మహ్మద్ ఆమిర్ తప్పు చేశాడు: ఇంజమామ్

Inzamam-ul-Haq says Mohd Amir incident will have negative impact on team

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేస్తూ ఆ దేశ స్టార్ పేసర్ మహ్మద్‌ ఆమిర్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమిర్ వీడ్కోలు వ్యవహారం పాకిస్థాన్ క్రికెట్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ క్రికెట్లరు ఆమిర్ విషయంలో రెండుగా చీలి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొందరూ ఆమిర్‌కు మద్దతు పలుకుతుండగా మరికొందరూ తప్పుబడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌, చీఫ్‌ సెలెక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ స్పందించాడు. అలాంటి అంశాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పాడు. గురువారం మీడియాతో మాట్లాడిన ఇంజమామ్‌.. ఆమిర్‌ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నాడు. ఎవరితోనైనా సమస్యలు ఉంటే హెడ్‌ కోచ్‌తో మాట్లాడాలని, అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే జట్టు యాజమాన్యంతో చర్చించాలని సూచించాడు.

Inzamam-ul-Haq says Mohd Amir incident will have negative impact on team

పాకిస్థాన్ క్రికెట్‌ బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌తో అతడికి విభేదాలున్నాయని తెలిసిందని మాజీ కెప్టెన్ చెప్పాడు. అయితే, వకార్‌ యూనిస్‌తో పాటుహెడ్‌ కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌తో సైతం తనకు విభేదాలు ఉన్నాయని ఆమిర్‌ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. వాళ్లిద్దరూ తన రిటైర్మెంట్‌కు కారణమని, ఏడాదిగా జట్టులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో అతను తీసుకున్న నిర్ణయం పాక్‌ బౌలింగ్‌ యూనిట్‌పై ప్రభావం చూపదని, కానీ అది జట్టు ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని ఇంజమామ్‌ ఆందోళన వ్యక్తం చేశాడు.

Story first published: Friday, December 25, 2020, 20:07 [IST]
Other articles published on Dec 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+