Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Inzamam-ul-Haq:గిట్లయితే కష్టమే.. కోహ్లీ, పుజారా, రహానే రాణించాలి!

Inzamam-ul-Haq says Kohli, Pujara, Rahane need to get big scores consistently

కరాచీ: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా ఇకనైనా భారీ స్కోర్లు చేయాలని లేదంటే జట్టుకు కష్టాలు తప్పవని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో కోహ్లీసేన చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ పరాజయంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఇంజమామ్.. సీనియర్ ఆటగాళ్లు బాధ్యతాయుతంగా ఆడాలన్నాడు. భారత జట్టు విజయాల్లో యువ ఆటగాళ్లే కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపాడు. గత రెండేళ్లుగా కోహ్లీ, పుజారా ఒక్క సెంచరీ చేయలేదనే విషయాన్ని ఈ పాక్ మాజీ కెప్టెన్ గుర్తుచేశాడు

 రెండేళ్లుగా సెంచరీ లేదు..

రెండేళ్లుగా సెంచరీ లేదు..

'విరాట్‌ కోహ్లీ సుమారు రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోయాడు. పుజారా కూడా అంతే. మరోవైపు రహానే పరుగులు చేసేందుకు తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో టీమిండియా ఎప్పుడు కష్టాల్లో ఉన్నా యువకులే కాపాడుతున్నారు. రిషభ్ పంత్‌ చాలా పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా కూడా వీలైనంత స్కోర్‌ సాధిస్తున్నాడు. అశ్విన్‌ కూడా చేతనైనన్ని పరుగులు చేశాడు. అనుభవజ్ఞులతో పోలిస్తే యువకులే ఎక్కువ పరుగులు చేస్తున్నారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

యువ ఆటగాళ్లదే పాత్ర..

యువ ఆటగాళ్లదే పాత్ర..

ఇంగ్లండ్ లాంటి పెద్ద సిరీస్‌లో టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ముందుండి నడిపించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆస్ట్రేలియా పర్యటన నుంచి నేను భారత క్రికెట్‌ను గమనిస్తున్నా. వాళ్లెంతో బాగా ఆడుతున్నారు. కఠిన పరిస్థితుల్లోనూ అక్కడ విజయం సాధించారు. అయితే, అక్కడ యువకులే కీలకపాత్ర పోషించారు. కోహ్లీ నంబర్‌ వన్‌ ఆటగాడు. పుజారా, రహానే కూడా మంచి టెస్టు ఆటగాళ్లు. కానీ, ఇలా భారీ స్కోర్లు చేయకుండా ఎక్కువ కాలం కొనసాగితే యువకులు ఒత్తిడికి గురవుతారు. వాళ్లెంత బాగా ఆడుతున్నా సీనియర్లు ముందుండి నడిపించాలి. వాళ్లు ఇలాగే ఒత్తిడికి గురవుతూ ఉంటే సరిగ్గా ఆడలేరు. ఇప్పుడు ఇంగ్లండ్‌ పర్యటనలోనూ ఇదే జరుగుతోంది'అని పాక్‌ మాజీ సారథి చెప్పుకొచ్చాడు.

రోహిత్, కోహ్లీదే బాధ్యత..

రోహిత్, కోహ్లీదే బాధ్యత..

అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 78 పరుగులకు ఆలౌటవ్వడంపై ఇంజమామ్ స్పందిస్తూ.. రోహిత్, కోహ్లీ బాధ్యత వహించాలన్నాడు. 'టీమిండియా బ్యాట్స్‌మన్‌ ఎవరూ ఇంగ్లండ్‌ బౌలర్లను ఏ మాత్రం ఇబ్బందిపెట్టలేకపోయారు. వారి బ్యాటింగ్‌ శైలి నాసిరకంగా తయారైంది. తొలి రెండు టెస్టుల్లోనూ భారత బ్యాటింగ్‌ అంత ఆసక్తికరంగా ఏం కనిపించలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలే దీనికి బాధ్యత వహించాల్సి ఉంది. నా దృష్టిలో వారిద్దరు బాగా బ్యాటింగ్‌ చేసుంటే.. పరిస్థితి మరోలా ఉండేది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 105 బంతులాడి 19 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా రోహిత్‌ కాస్త స్ట్రోక్‌ప్లేతో షాట్లు ఆడితే టాపార్డర్‌, మిడిలార్డ్రర్‌కు ధైర్యంగా ఉండేది' అని అన్నాడు.

కోహ్లీ మరి దారుణంగా..

కోహ్లీ మరి దారుణంగా..

'విరాట్‌ కోహ్లీ ప్రదర్శన మరింత దారుణంగా తయారైంది. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. లీడ్స్‌ టెస్టులోనూ విరాట్ అదే ప్రదర్శనను చేశాడు. 31 బంతులాడి కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి పేలవ రీతిలో ఔట్ అయ్యాడు. వీరిద్దరు మాత్రమే కాదు జట్టులో ఉన్న మిగిలిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టీమిండియా పతనాన్ని శాసిస్తున్నాడు. టెస్టు సిరీస్‌ ఆరంభం నుంచి అండర్సన్‌ మంచి ప్రదర్శననే కనబరుస్తున్నాడు. భారత్ బ్యాటింగ్‌ ఇలాగే కొనసాగితే.. మ్యాచ్‌ నాలుగు రోజుల్లో ముగిసే అవకాశం ఉంటుంది' అని ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ చెప్పుకొచ్చాడు. ఓడిపోతే బాధ్యత వహించాల్సింది మీరే (రోహిత్, కోహ్లీ) అని పేర్కొన్నాడు.

Story first published: Sunday, August 29, 2021, 20:25 [IST]
Other articles published on Aug 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+