Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. అంతకుముందు అతన్ని అలా చూడలేదు: ఇంజమామ్ ఉల్ హక్

Inzamam-ul-Haq says I have never seen Sachin Tendulkar bat like that before

కరాచీ: 2003 ప్రపంచకప్‌లో తమ జట్టుపై భారత దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ అద్భుతమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్‌ హక్‌ తెలిపాడు. అంతకుముందు సచిన్‌ను అలా ఎప్పుడూ చూడలేదని, ఆ మ్యాచ్‌లో ప్రత్యేకంగా ఆడాడని కొనియాడాడు. టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌తో వీడియో చాట్‌లో పాల్గొన్న ఇంజమామ్‌ సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2003 వరల్డ్ కప్‌లోని భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.

అసాధారణ బ్యాటింగ్..

అసాధారణ బ్యాటింగ్..

‘సచిన్ ఆటను ఎన్నోసార్లు చూశాను. కానీ ఆ మ్యాచ్‌లో అతను ఆడిన విధానాన్ని ఎప్పుడూ చూడలేదు. బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో మా బౌలర్లను సచిన్ ఎదుర్కొన్న తీరు అద్భుతం. ఆ మ్యాచ్‌లో 98 పరుగులు వద్ద సచిన్‌ను షోయబ్‌ అక్తర్‌ ఔట్‌ చేశాడు. అయితే సచిన్‌ ఆడిన ఇన్నింగ్స్‌ల్లో అదే అత్యుత్తమం. అతను ఒత్తిడిని చిత్తు చేశాడు. మా భీకర పేసర్లను ఎదుర్కొంటూ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

 భీకర బౌలింగ్‌నూ..

భీకర బౌలింగ్‌నూ..

సచిన్ కొట్టిన బౌండరీలు ఇతర బ్యాట్స్‌మెన్‌పై ఉన్న ఒత్తిడిని తొలగించాయి. మా బౌలింగ్‌ లైనప్‌లో వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, షోయబ్‌ అక్తర్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. పైగా సౌతాఫ్రికాలోని సెంచురియన్ వేదికగా ఆ మ్యాచ్ జరిగింది. దీంతో బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై మంచి స్కోరే సాధించామనుకున్నాం. కానీ సచిన్ గొప్పగా ఆడి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు.'' అని ఇంజమామ్‌ అన్నాడు.

 సూపర్ విక్టరీ..

సూపర్ విక్టరీ..

సచిన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 7 వికెట్లకు 273 పరుగులు చేసింది. అనంతరం సచిన్ (75 బంతుల్లో 12 ఫోర్లు ,ఒక సిక్సర్‌ 98) సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో 45.4 ఓవర్లలోనే 4 వికెట్లకు 276 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. సచిన్ ఔటైనా..చివర్లో రాహుల్ ద్రవిడ్(44 నాటౌట్), యువరాజ్ సింగ్(50 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో మిగతా పని పూర్తి చేశాడు. షోయబ్‌ అక్తర్‌ వేసిన షార్ట్‌బాల్‌ను సచిన్‌ డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా కొట్టిన సిక్సర్‌ ప్రపంచకప్‌లో హైలైట్ షాట్‌గా నిలిచింది.

మనం చూసే కోహ్లీ వేరు.. చాలా సరదా మనిషి: ఆడం జంపా

Story first published: Sunday, November 22, 2020, 19:52 [IST]
Other articles published on Nov 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+